E-Paper
Advertisement

Chiranjeevi: మొన్న తమన్..నేడు చిరు కోర్టు జంట పై మెగాస్టార్ కామెంట్స్…అన్ని చూస్తున్నానంటూ!

Chiranjeevi: మొన్న తమన్..నేడు చిరు కోర్టు జంట పై మెగాస్టార్ కామెంట్స్…అన్ని చూస్తున్నానంటూ!
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఇలా తన సినిమాల పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు చిరంజీవి చిన్న సినిమాలకు కూడా ఎంతో ప్రోత్సాహం కల్పిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిరంజీవి బ్యాండ్ మేళం(Band Melam) సినిమాకు తనదైన శైలిలోనే సహాయ సహకారాలను అందించారు. కొత్త దర్శకుడు సతీష్ జివ్వాజి దర్శకత్వంలో హర్ష రోషన్(Harsha Roshan) శ్రీదేవి (Sridevi)జంటగా నటించిన చిత్రం బ్యాండ్ మేళం. ఈ సినిమా శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని మార్చి 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

చిరంజీవి చేతుల మీదుగా బ్యాండ్ మేళం ట్రైలర్..

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ ట్రైలర్ వీడియోని మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం మొత్తం చిరంజీవినీ కలిసారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా గురించి కోన వెంకట పనితీరు గురించి చిరంజీవి ప్రశంసల కురిపించారు కూడా చాలా అద్భుతంగా ఉంది అంటూ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేశారు.

మీ డాన్స్ వీడియోలు చూస్తున్నాను..

Advertisement

ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన శ్రీదేవి హర్ష రోషన్ గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. బయట సోషల్ మీడియాలో మీరిద్దరూ కలిసి చేసే డాన్స్ వీడియోలు కూడా కనపడుతున్నాయని మీరు ఎవరికీ తెలియదు అనుకుంటున్నారు కానీ అన్ని చూస్తున్నానంటూ చిరంజీవి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా వీరిద్దరూ చేసే డాన్స్ వీడియోలు, రీల్స్ గురించి చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవ్వడంతో మరోసారి శ్రీదేవి హర్ష రోషన్ లవ్ రూమర్ల గురించి వార్తలు తెరపైకి వచ్చాయి.

కెమిస్ట్రీ ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి..

Advertisement

ఇటీవల విడుదల చేసిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ కూడా వీరిద్దరి గురించి మాట్లాడుతూ మీ ఇద్దరికీ కెమిస్ట్రీ బాగా ఉంది. కెమిస్ట్రీని కాస్త ఫిజిక్స్ అవ్వకుండా చూడండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా చిరంజీవి కూడా వీరి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నిజంగా అన్ని వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరి లవ్ రూమర్ల గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఇద్దరి మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అంటూ వీరిద్దరూ లవ్ రూమర్లను ఖండించిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరూ కలిసి కోర్టు సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు బ్యాండ్ మేళం సినిమా ద్వారా మరోసారి జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలోనే వీరిద్దరి లవ్ రూమర్లు బయటకు వస్తున్నాయి.

Also Read: Mrunal Thakur: సిగ్గు లేకుండా. అవకాశాలు అడిగాను.. కెరీర్ కష్టాలను బయట పెట్టిన మృణాల్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×