E-Paper
Advertisement

మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్ చరణ్, క్లిన్ కారా..

మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్ చరణ్, క్లిన్ కారా..
Advertisement

Mega Family Photo: ఫాదర్స్ డే సందర్భంగా మెగా అభిమానులకు అత్యంత సంతోషాన్నిచ్చే ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మరియు మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా.. ఇలా ఒకే ఫ్రేమ్‌లో మూడు తరాల మెగా వారసులను చూసే అరుదైన క్షణం త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం.

Read also-బాక్సాఫీస్ వద్ద సమంత హవా.. 3 రోజుల్లో ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్ ఎంతంటే?

Advertisement

Mega158 సెట్స్‌కు రామ్ చరణ్, క్లిన్ కారా

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబి కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం Mega158. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. అయితే, ఈ సినిమా సెట్స్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.

Advertisement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ముద్దుల కుమార్తె క్లిన్ కారాతో కలిసి సర్ప్రైజింగ్‌గా Mega158 సెట్స్‌ను సందర్శించారు. అక్కడ మెగాస్టార్ చిరంజీవితో కలిసి చరణ్, క్లిన్ కారా కాసేపు సరదాగా సమయం గడిపారు. ఈ క్రమంలోనే అక్కడ ఒక అద్భుతమైన మెగా పిక్చర్‌ను షూట్ చేసినట్లు తెలుస్తోంది. తాత-తండ్రి-మనవరాలు ఉన్న ఈ అరుదైన ఫోటో ఫాదర్స్ డే కానుకగా త్వరలోనే విడుదల కానుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

Read also-Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

గతంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న దాఖలాలు ఉన్నాయి కానీ, ఇప్పుడు చిన్నారి క్లిన్ కారా కూడా వారితో తోడవడంతో ఈ ‘త్రీ జనరేషన్స్’ పిక్చర్ కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఈ క్యూట్ అండ్ పవర్‌ఫుల్ మెగా మూమెంట్ అఫీషియల్‌గా ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×