E-Paper
Advertisement

చెన్నై జ్ఞాపకాలు నెమరువేసుకున్న చిరంజీవి.. ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్ హైలైట్స్!

చెన్నై జ్ఞాపకాలు నెమరువేసుకున్న చిరంజీవి.. ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈవెంట్ హైలైట్స్!
Advertisement

Chennai LoveStory:‘చెన్నై లవ్ స్టోరీ’ కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా రవి వర్మ నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 24న థియేటర్ లో రిలీజ్ కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ యూనిట్.ఇక ఈ సినిమాకి ముఖ్య అతిధిగా చిరంజీవి రావడంతో ఈవెంట్ మరింత సందడిగా మారిపోయింది.. ఒకప్పుడు అవకాశాల కోసం చెన్నై గల్లీల్లో తిరిగిన రోజుల నుంచి, ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ గా నిలబడిన తన జర్నీని గుర్తుచేసుకున్నారు.. చెన్నై లవ్ స్టోరీ అనే పేరు వినగానే తనకు పాత రోజులు గుర్తొచ్చాయని, ఈ టైటిల్‌లోనే ఏదో తెలియని ఒక మేజిక్ ఉందని చెప్పుకొచ్చారు చిరు.

ఈనాటి యూత్‌కి ఒక పెద్ద ఇన్సిపిరేషన్

Advertisement

కేవలం తన కథ చెప్పడమే కాకుండా, కష్టపడి పైకి వచ్చే యంగ్ టాలెంట్‌ని మెగాస్టార్ ఎప్పుడూ భుజం తడతారని మరోసారి ప్రూవ్ చేశారు. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఎస్‌కేఎన్, సాయి రాజేష్‌తో పాటు డైరెక్టర్ రవి నంబురి, హీరో కిరణ్ అబ్బవరంపై ప్రశంసల వర్షం కురిపించారు.

also read :OTP 6 అంకెలే ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?

Advertisement

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంత కష్టంతో ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకుంటున్న వీళ్ల లైఫ్ జర్నీ ఈనాటి యూత్‌కి ఒక పెద్ద ఇన్సిపిరేషన్ అని చెప్పారు. హాయిగా ఉండే కంఫర్ట్ జోన్ దాటి బయటపడి, కష్టపడితేనే సక్సెస్ దక్కుతుందని, ప్రతి ఒక్కరూ తమ కలల కోసం గట్టిగా ట్రై చేయాలని పేర్కొన్నారు.

నేనంతగా డాన్స్ చేయడానికి కారణం మణి శర్మే 

ఇక కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి కొండల మధ్య పోటీని తట్టుకుని నిలబడటానికి తాను ఎంతగానో కష్టపడ్డానని, ఇపుడు రాయచోటి అనే చిన్న ఊరి నుంచి వచ్చిన కిరణ్ కూడా అదే రేంజ్‌లో కష్టపడి పైకి రావడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తోందన్నారు. ఇండస్ట్రీకి ఇలాంటి కొత్త వాళ్లు ఇంకా రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇక సంగీత దర్శకుడు మణిశర్మ గురించి మాట్లాడుతూ “నేను సినిమాల్లో అంత రచ్చగా డాన్సులు చేశానంటే దానికి మెయిన్ రీజన్ మణిశర్మ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్కే” అని చిరంజీవి ఓపెన్‌గా చెప్పేశాడు.

ఎలాంటి కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటుందో

ఇక సినిమా విషయానికి వస్తే ‘క ‘ , kర్యాంప్ లాంటి హిట్స్ తో పాతుకుపోయిన కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీ గౌరిప్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని కలర్ ఫోటో, బేబీ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కలిసి నిర్మిస్తున్నాయి.చూడాలి మరి రేపే అంటే జులై 24న రాబోతున్న ఈ సినిమా మేకర్స్ అనుకుంటున్నట్టుగా ఎలాంటి కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటుందో !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×