E-Paper
Advertisement

గోవాలో ఖుష్బూ కూతురి పెళ్లి.. ఒకే వేదికపై మెరిసిన టాలీవుడ్ స్టార్స్

గోవాలో ఖుష్బూ కూతురి పెళ్లి.. ఒకే వేదికపై మెరిసిన టాలీవుడ్ స్టార్స్
Advertisement

khushbu daughter wedding: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ కిక్కే వేరు. అలాంటిది తెలుగు సినిమా రంగాన్ని దశాబ్దాలుగా ఏలుతున్న ముగ్గురు పిల్లర్స్ ఒకే చోట చేరి సందడి చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవును, మీరు ఊహించింది నిజమే! టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి, ‘విక్టరీ’ వెంకటేష్, ‘కింగ్’ అక్కినేని నాగార్జున ఒకే వేదికపై మెరిసి అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ కుమార్తె వివాహ వేడుక కోసం ఈ ముగ్గురు టాప్ హీరోలు గోవాలో వాలారు.

చెన్నైకి చెందిన శ్రవణ్ శ్రీనివాసన్‌ అనే యువకుడిని, ఖుష్బూ కూతురు అవంతిక గత కొంతకాలంగా ప్రేమిస్తున్నట్లుగా వార్తల వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి.

కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన సీనియర్ స్టార్స్ 

Advertisement

ఒకప్పుడు వెండితెరపై ఖుష్బూతో జతకట్టి సూపర్ హిట్ కాంబినేషన్స్ అందించిన ఈ ముగ్గురు హీరోలు.. ఇప్పుడు ఆమె పిలుపు అందుకొని పెళ్లి వేడుకకు ప్రత్యేకంగా హాజరవడం విశేషం. ఎనభై, తొంభైల కాలంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో ఖుష్బూ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ నలుగురు ఒకే ఫ్రేమ్‌లో బంధీ అవ్వడం సినిమా ప్రియులకు మాంచి కిక్కిస్తుంది. గోవాలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఈ ముగ్గురు హీరోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ట్రెడిషనల్ వేర్ అండ్ క్లాసీ లుక్స్‌తో ఈ సీనియర్ స్టార్లు కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇచ్చారనే చెప్పాలి.

ఇదే ఈవెంట్ లో  సందడి చేసిన త్రిష 

ఈ పెళ్లి వేడుకలో ముగ్గురు హీరోల స్టైలిష్ ఎంట్రీలు, లుక్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి రాయల్ లుక్‌లో కనిపిస్తూ.. తనదైన చిరునవ్వుతో పెళ్లి పెద్ద దిక్కులా సందడి చేశారు. ఖుష్బూ ఫ్యామిలీతో చిరు దిగిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు కింగ్ నాగార్జున అరవై ఏజ్ దాటినా తనే ఎప్పటికీ ‘మన్మథుడు’ అని మరోసారి నిరూపించారు. అల్ట్రా మోడ్రన్ ఎత్నిక్ వేర్‌లో నాగ్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఎక్కడ వెంకీ మామ ఉంటే అక్కడ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కాబట్టి.. పెళ్లి వేడుకలో తనదైన ఈజ్, ఎనర్జీతో వెంకటేష్ అందరినీ పలకరిస్తూ అసలైన వెడ్డింగ్ హంగామా క్రియేట్ చేశారు.ఇక ఇదే ఈవెంట్ లో త్రిష కూడా సందడి చేయడం విశేషం.

టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ఫోటోలు 

Advertisement

సాధారణంగా అవార్డు ఫంక్షన్లలోనో లేదా ఇండస్ట్రీ మీటింగ్‌లలోనో హీరోలు కలవడం కామన్. కానీ, ఇలా పర్సనల్ లైఫ్ ఈవెంట్స్ కోసం, అదీ పక్క రాష్ట్రంలో జరుగుతున్న వేడుకకు టాలీవుడ్ త్రిమూర్తులు ఒకేసారి తరలివెళ్లడం చాలా అరుదుగా జరుగుతుంది. ఖుష్బూ సుందర్‌కు టాలీవుడ్ స్టార్స్‌తో ఉన్న అనుబంధం, వారి మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిదో ఈ ఒక్క ఈవెంట్‌తో అర్థమవుతోంది. “మా ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో ఉంటే థియేటర్లలో పూనకాలే.. ఇప్పుడు గోవా బీచ్ లో కూడా అదే వైబ్ కనిపిస్తోంది” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ ఫోటోలు టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×