E-Paper
Advertisement

Tollywood: రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారిన చిరంజీవి హీరోయిన్!

Tollywood: రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారిన చిరంజీవి హీరోయిన్!
Advertisement

Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ సరిపెట్టుకుంటున్న హీరోయిన్స్ ని మనం చూస్తూనే ఉన్నాం. మరికొంతమంది ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూనే.. ఇంకొక వైపు వ్యాపారరంగంలో అడుగుపెట్టి దూసుకుపోతున్నారు.. అయితే ఇంకొంతమంది ప్రస్తుతం అవకాశాలు లేక డబ్బు సంపాదన కోసం వినూత్న పద్ధతులను అవలంబిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఒక హీరోయిన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.

రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారిన చిరంజీవి హీరోయిన్..

2000 సంవత్సరంలో వరుస చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న రిమీ సేన్ (Rimi Sen) చిరంజీవి (Chiranjeevi ) హీరోగా నటించిన ‘అందరివాడు’ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను అభిమానులుగా మార్చేసుకుంది. ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించిన ఈమె.. ప్రస్తుతం దుబాయ్ లో రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వ్యాపారం చేస్తోంది. సినిమా అవకాశాలు తగ్గడం వల్లే ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

దుబాయ్ నన్ను స్వాగతించింది..

Advertisement

ఇంటర్వ్యూల భాగంగా రిమీ సేన్ మాట్లాడుతూ..” దుబాయ్ దేశం నన్ను ప్రేమతో స్వాగతించింది. ఇక్కడి జనాభాలో 95 శాతం మంది ప్రవాసులే ఉన్నారు. ముఖ్యంగా దుబాయ్ ప్రజలు అందరి గురించి ఆలోచిస్తారు. సౌకర్యవంతమైన జీవితాన్ని మనం గడపవచ్చు. ఇండియాతో పోల్చుకుంటే దుబాయ్ లో వ్యాపార అవకాశాలు మరింత సులభంగా లభిస్తాయి .ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా సజావుగా పనిచేస్తుంది. దీనికి కారణం ఇక్కడున్న క్రమశిక్షణే”అంటూ రీమిసేన్ తెలిపింది. ఇక ప్రస్తుతం రిమీ సేన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందంతో ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగి తన మెదడుకు పని పెట్టింది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.

ALSO READ:Kasthuri Shankar: మగాళ్లను రాక్షసుల్లా పోల్చిన సీరియల్ నటి కస్తూరి శంకర్… చిన్మయి పోస్ట్‌కు ఘాటు రిప్లే

రిమీ సేన్ కెరియర్..

Advertisement

రిమీ సేన్ విషయానికి వస్తే.. 1981లో పుట్టిన ఈమె.. అసలు పేరు సుభ మిత్రాసేన్. 2001లో ఇదే నా మొదటి ప్రేమలేఖ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. 2005లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అందరివాడు సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ రెండు చిత్రాల కంటే ముందే 1996లో బెంగాలీ చిత్రమైన థాము సినిమా ద్వారా నటన రంగ ప్రవేశం చేసింది. ఇక చివరిగా 2011లో ధులియా దర్శకత్వంలో వచ్చిన తిగ్మాన్షూ అనే సినిమాలో నటించి ఇండస్ట్రీకి దూరమయ్యింది..ఇకపోతే నటిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఒకానొక సమయంలో ఒక చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించింది. పైగా ఈ సినిమా 63వ నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది. అదేదో కాదు బుధియా సింగ్: బోర్న్ టు రన్. అలా సినిమాలలో హీరోయిన్గా, నిర్మాతగా ప్రేక్షకులను ఆకట్టుకున్న రిమీ సేన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇకపోతే మళ్లీ ఈమె సినిమాలలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు .మరి దర్శక నిర్మాతలు ఎవరైనా ఒక అవకాశం ఇస్తే మళ్లీ నటిగా తిరిగి తన కెరియర్ ను ప్రారంభిస్తుందేమో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×