E-Paper
Advertisement

Mega 158: మరో సారి సంక్రాంతికి రెడీ అవుతున్న ‘మెగా158’.. స్టార్టింగ్ డిలే ఎందుకంటే?

Mega 158: మరో సారి సంక్రాంతికి రెడీ అవుతున్న ‘మెగా158’.. స్టార్టింగ్ డిలే ఎందుకంటే?
Advertisement

Mega 158: టాలీవుడ్‌లో ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఈ సినిమా ప్రారంభం కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా షూటింగ్ షెడ్యూల్ విడుదల తేదీకి సంబంధించిన కీలక వార్తలు బయటకు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ విషయంలో చిన్న మార్పు జరిగినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రారంభోత్సవం కాస్త ఆలస్యమై.. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన లేదా మార్చి నెలాఖరులో జరగనుంది. కొత్త ఏడాదిలో మెగాస్టార్ కొత్త సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Read also-Yami Gautam: కృతి సనన్‌ను అవమానించడంపై యామీ గౌతమ్ వివరణ.. ఏం జరిగిందంటే?

ఏప్రిల్ 14 నుండి సెట్స్ పైకి

Advertisement

సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలోనే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారు. ఏప్రిల్ 14న షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవిని వింటేజ్ లుక్‌లో చూపించిన బాబీ, ఈసారి అంతకు మించిన మాస్ ఎలిమెంట్స్‌తో ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి సీజన్ ఎప్పుడూ కలిసొచ్చే అంశమే. అందుకే ఈ సినిమా విడుదలను కూడా పక్కాగా ప్లాన్ చేశారు. జనవరి 12, 2027న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువల తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే సంక్రాంతికి విచ్చిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మెగాస్టార్ మరోసారి సంక్రాంతికి రావడానికి రెడీ అవుతున్నారు. మరి రాబోయే సంక్రాంతి కలిసి వస్తుందో లేదో చూడాలి మరి.

Read also-Psychological horror thriller OTT: పెళ్ళి కాకుండానే ప్రెగ్నెన్సీ… నరకం చూపించే సైతాన్… ఏం సినిమా సామి

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×