E-Paper
Advertisement

మెగాస్టార్ ‘MEGA158’ షూటింగ్ షురూ.. సిటీ కాలేజీలో చిరంజీవి, అనస్వరా రాజన్!

మెగాస్టార్ ‘MEGA158’ షూటింగ్ షురూ.. సిటీ కాలేజీలో చిరంజీవి, అనస్వరా రాజన్!
Advertisement

Chiranjeevi 158: మెగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. గురువారం అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం, ఎలాంటి ఆలస్యం లేకుండా ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకుంది. హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రాత్మక కట్టడం ప్రభుత్వ సిటీ కాలేజీ ప్రాంగణంలో ఈ సినిమా తొలి షెడ్యూల్ శరవేగంగా షురూ అయింది.

Read also-పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్న గాడ్ ఆఫ్ మాసెస్.. ఆ రోజు పూనకాలే..

తొలిరోజే రంగంలోకి మెగాస్టార్

Advertisement

సాధారణంగా పూజా కార్యక్రమాలు ముగిసిన కొన్ని రోజులకు షూటింగ్స్ మొదలవుతుంటాయి. కానీ, ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగింది. ఈ రోజు జరుగుతున్న రెగ్యులర్ షూటింగ్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మలయాళ ముద్దుగుమ్మ, ‘మ్యాన్యుమ్మెల్ బాయ్స్’ ఫేమ్ అనస్వరా రాజన్ కూడా జాయిన్ అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాలను దర్శకుడు ప్రస్తుతం సిటీ కాలేజీలో చిత్రీకరిస్తున్నారు.

హైదరాబాద్ సిటీ కాలేజీ పరిసరాల్లో మెగాస్టార్ షూటింగ్ జరుగుతుండటంతో, ఆయనను చూసేందుకు అభిమానులు, స్థానికులు భారీగా తరలివస్తున్నారు. చిత్ర యూనిట్ కట్టుదిట్టమైన భద్రత నడుమ చిత్రీకరణను జరుపుతోంది.

Advertisement

Read also-త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

చిరంజీవి సరసన ప్రముఖ కథానాయికతో పాటు, కథలో కీలక పాత్రల కోసం టాలీవుడ్, మాలీవుడ్‌కు చెందిన క్రేజీ నటీనటులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగమే అనస్వరా రాజన్ ఎంట్రీ. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు పవర్‌ఫుల్ సోషల్ మెసేజ్ లేదా ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. విజువల్స్ అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. నిన్నటి పూజా వేడుకల ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, ఈరోజు షూటింగ్ ప్రారంభం కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘విశ్వంభర’ వంటి సోషియో ఫాంటసీ మూవీ తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×