E-Paper
Advertisement

Chinmayi: నీ తండ్రి నిన్ను రే*ప్ చేసింటాడు.. దిమ్మతిరిగేలా చిన్మయి సమాధానం!

Chinmayi: నీ తండ్రి నిన్ను రే*ప్ చేసింటాడు.. దిమ్మతిరిగేలా చిన్మయి సమాధానం!
Advertisement

Chinmayi: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రెటీలు అభిమానులకు ఎప్పుడు చేరువలో ఉంటున్నారు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అభిమానులకు, సెలబ్రిటీలకు మధ్య అవినాభావ సంబంధం ఏర్పడడానికి సోషల్ మీడియా వారధిగా వ్యవహరిస్తోంది. అయితే ఇలాంటి సోషల్ మీడియా మంచికి ఉపయోగపడాలే కానీ ఈ మధ్యకాలంలో దీనిని అడ్డంగా పెట్టుకుని సెలబ్రిటీలపై విచక్షణారహితంగా కామెంట్లు చేస్తూ.. తాము మనుషులమే అన్న విషయాన్ని మరిచిపోయి.. అత్యంత హీనంగా ప్రవర్తిస్తూ.. అటు సెలబ్రిటీలకే కాదు ఇటు సామాన్యులకి కూడా ఇబ్బందులను కలుగజేస్తున్నారు. ముఖ్యంగా ఒక మనిషి ఎలా మాట్లాడాలి? ఏ విధంగా మాట్లాడాలి? అని కనీస జ్ఞానం కూడా లేకుండా పోతోందనే వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు ఇలాంటి అసభ్య పదజాలాలు సోషల్ మీడియాలో వినిపించినప్పుడు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది.

ఇకపోతే కొంతమంది సెలబ్రిటీలు స్త్రీ వాదులుగా మారిపోయారు. ప్రత్యేకించి అటు సోషల్ మీడియా ద్వారా ఇటు సమాజంలో మహిళలకు, చిన్నపిల్లలకు అండగా నిలుస్తూ.. వారికి ఏదైనా ఇబ్బంది కలిగే కామెంట్లు చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంలో ముందుంటున్నారు. అలాంటి వారిలో సింగర్ చిన్మయి (Chinmayi) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకవైపు తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించడమే కాకుండా సెలబ్రిటీలకు డబ్బింగ్ చెప్పి గాత్రదానం కూడా చేస్తూ మరింత పేరు సంపాదించుకుంది. ఇకపోతే ఈమధ్య సమాజంలోని విషయాలపై స్పందిస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.

చిన్మయిపై నెటిజన్ అసభ్యకర పదజాలం..

Advertisement

ఇక తన విషయంలో ఎవరైనా అసభ్యకర పదజాలంతో దూషిస్తే మాత్రం వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుందనటంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే చిన్మయి తండ్రిని అత్యంత అసభ్యకరంగా సంబోధిస్తూ ఒక నెటిజన్ చేసిన కామెంట్లకు ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్నయి. విషయంలోకి వెళ్తే.. గతంలో ఒక చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియో పై “ఫన్ అండ్ డాంక్” పేరుతో ప్రణీత్ హన్మంత్ చేసిన అసభ్యకర వ్యాఖ్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే తాజాగా ఇదే రీతిలో ప్రముఖ సింగర్ చిన్మయిపై ఒక నిటిజన్ మీ తండ్రి తప్పకుండా నిన్ను అత్యాచారం చేసి ఉంటాడు అని చాలా నీచమైన కామెంట్ చేశాడు.

ఎప్ స్టీన్ ఫైల్స్ పై చిన్మయి సంచలన కామెంట్..

అయితే అతడు ఇలా కామెంట్ చేయడానికి కారణం.. ప్రపంచవ్యాప్తంగా ఎప్ స్టీన్ సె*క్స్ కుంభకోణం సంచలనంగా మారిన విషయం తెలిసిందే .ముఖ్యంగా బాలికలపై లైంగిక వేధింపుల గురించి ఈ ఎప్ స్టీన్ ఫైల్స్ పేరుతో వైరల్ అవుతోంది. అయితే ఈ అంశంపై తాజాగా సింగర్ చిన్మయి కూడా స్పందించింది. “భారత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి భవనంలో కూడా ఎప్ స్టీన్ లు ఉంటారు. ఈ విషయంలో గుడ్డిగా మత పెద్దలను కూడా నమ్మకండి . వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది. భారతదేశంలో లక్షలాదిమంది బాల లైంగిక నేరస్తులు ఉన్నారని గుర్తించుకోండి. మీకు తెలిసిన అమ్మాయిని కూడా అడగండి. మొదటిసారి ఎప్పుడు ఏ వయసులో లైంగిక వేధింపులకు తాను గురైందో మీకు చెబుతుంది” అంటూ పోస్ట్ పెట్టింది. ఇక దీనిపైనే ఒక నెటిజన్ ఇలా చిన్మయిపై అసభ్యకర పదజాలం ఉపయోగించాడు.

నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన చిన్మయి..

Advertisement

దీనికి కౌంటర్ గా చిన్మయి ఇలా పోస్ట్ పెట్టింది. “నా తండ్రి నన్ను అత్యాచారం చేయలేదు. కానీ కూతుర్లు తమ తండ్రులచే అత్యాచారం చేయబడతారని మీరు కచ్చితంగా ఊహించుకుంటున్నారని తెలుస్తోంది. ఇక మీరేమిటో మీ సంస్కృతి ఏమిటో.. మీరు పెరిగిన వాతావరణం ఏమిటో.. అర్థమవుతుంది. మిమ్మల్ని ఎవరు పెంచారో కూడా ఈ ప్రవర్తనలోనే కనబడుతోంది” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది చిన్మయి. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ: Maheshbabu: మహేష్ సమర్పణలో మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×