// // Chinmayi Sripada: ఆ గౌరవనీయులందరూ జైల్లో ఉండాల్సిందే..- Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Chinmayi Sripada: ఆ గౌరవనీయులందరూ జైల్లో ఉండాల్సిందే.. మరోసారి చిన్మయి ఘాటైన వ్యాఖ్యలు..!

Chinmayi Sripada: ఆ గౌరవనీయులందరూ జైల్లో ఉండాల్సిందే.. మరోసారి చిన్మయి ఘాటైన వ్యాఖ్యలు..!
Advertisement

Chinmayi Sripada: ప్రఖ్యాత గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి శ్రీపాద.. మరోసారి మహిళల భద్రతపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. చిన్న వయసులోనే అమ్మాయిలు ఎదుర్కొనే వేధింపుల గురించి ఆమె చాలా స్పష్టంగా మాట్లాడారు.

చిన్మయి తన ట్వీట్‌లో..ఒక అమ్మాయి టీనేజ్ దశలోనే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో, స్కూల్ పరిసరాల్లో ఎదుర్కొనే అసభ్య ప్రవర్తన గురించి చెప్పారు. బస్సులు, ట్రైన్లు, స్కూల్ అసెంబ్లీ లైన్లలో కూడా కొంతమంది అబ్బాయిలు, పురుషులు అసభ్యంగా ప్రవర్తిస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ సాధారణ విషయాలుగా మారిపోవడం చాలా ప్రమాదకరమని ఆమె అన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ..ఒక అమ్మాయి తన జీవితంలో ఎంతమంది పురుషుల చేత వేధింపులు ఎదుర్కొందో చెప్పగలిగితే..నిజానికి ఇప్పటికి చాలామంది జైల్లోనే ఉంది ఉంటారు అని అర్థమవుతుందని అన్నారు. కానీ అలాంటి వారు బయట సమాజంలో గౌరవనీయుడుగా కనిపించడం .. అలానే అలాంటి వాళ్లకు మంచి భార్య, పిల్లలు, అమ్మ నాన్న ఉండడం.. చాలా బాధాకరమని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

ఇలాంటి విషయాలపై చిన్మయి మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమె మహిళలపై జరిగే అన్యాయాలపై, లైంగిక వేధింపులపై, న్యాయం జరగని సంఘటనలపై బహిరంగంగా మాట్లాడారు. విమర్శలు వచ్చినా.. ట్రోలింగ్ ఎదురైనా ఆమె వెనకడుగు వేయలేదు.

Advertisement

చిన్మయి ట్వీట్‌కు పలువురు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా హీరోయిన్ సమంత కూడా ఇలాంటి అంశాలపై ఎప్పుడూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, మహిళల గొంతుకు బలం ఇస్తూ వస్తున్నారు. చిన్మయి లాంటి వ్యక్తులు మాట్లాడటం వల్లే సమాజంలో మార్పు వస్తుందని కొంతమంది అభిమానులు అంటున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ఎందుకు ప్రతిసారి అమ్మాయిల తరుపున ఆలోచించే వివాదాలు చేస్తూ ఉంటుంది అందుకని కామెంట్లు పెడుతున్నారు. అమ్మాయిల వల్ల మోసపోయిన అబ్బాయిలు కూడా ఉన్నారు అంటూ వాళ్ళ ఆవేదన కూడా చిన్మయి.. పోస్ట్ కింద కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: Dhurandhar 2 Teaser: ధురంధర్ 2 టీజర్ అప్డేట్..1 నిమిషం 48 సెకండ్ల పాటు అరాచకం..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×