E-Paper
Advertisement

Peddi special Video : చికిరి సాంగ్ కోసం చరణ్ పడ్డ కష్టం చూశారా… గుండె తరుక్కుపోతుంది మావా

Peddi special Video : చికిరి సాంగ్ కోసం చరణ్ పడ్డ కష్టం చూశారా… గుండె తరుక్కుపోతుంది మావా
Advertisement

Peddi special Video : బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన సినిమా పెద్ది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ క్యారెక్టర్ ని చాలా అద్భుతంగా ఈ సినిమాలో డిజైన్ చేశాడు బుచ్చిబాబు. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్ర తర్వాత ఈ పాత్ర హైలెట్ కాబోతుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ మాట్లాడుతున్నారు. ఇదివరకే సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ వీడియో కూడా విపరీతంగా చాలా మందిని ఆకట్టుకుంది. రామ్ చరణ్ యాస కూడా వినసొంపుగా అనిపించింది.

ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కోసం ఎదురుచూసిన వారందరికీ కూడా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన చికిరి అనే పాట 100 మిలియన్ వ్యూస్ సాధించింది. అయితే ఈ పాట వెనుక ఉన్న కష్టం తెలిసేలా ఒక వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ వీడియో చూస్తుంటే ఎన్నో ఆసక్తికర విషయాలు బయట పడుతున్నాయి.

రామ్ చరణ్ కష్టం చూశారా? 

Advertisement

ఈ పాటకు 100 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు మాత్రమే బయట ఎక్కువగా వినిపిస్తుంది. కానీ రిలీజ్ చేసిన వీడియో చూస్తుంటే రామ్ చరణ్ కష్టం కనిపిస్తుంది. ఏకంగా ఈ లొకేషన్ కోసం 45 నిమిషాలు ట్రెక్కింగ్ చేస్తూ మరీ కొండపైకి ఎక్కారు. అయితే మామూలుగా ఊళ్ళల్లో తిరిగేవాళ్లు ఎక్కడ మామూలు విషయమే. కానీ చిన్నప్పుడు నుంచి గోల్డ్ స్పూన్ తో పెరిగిన చరణ్ ఇటువంటి సాహసాలు చేయడం అనేది మామూలు విషయం కాదు.

దర్శకుడికి జాగ్రత్తలు 

Advertisement

బుచ్చిబాబు ఈ కొండను ఎక్కే టైంలో వెనకనుంచి రామ్ చరణ్ అనే మాటలు మనం క్లియర్ గా వినొచ్చు. తల జాగ్రత్త అని పదేపదే దర్శకుడు బుచ్చిబాబుకు చెబుతున్నారు. మరోవైపు బుచ్చిబాబు తనకు రామ్ చరణ్ తో ఉన్న అభిమానాన్ని కూడా కొండ ఎక్కే టైంలోనే చెప్పాడు.

చిరుత సినిమా వచ్చినప్పుడు స్క్రీన్ మీద మీరు ఎలా ఉంటారు అని అందరం అనుకునేవాళ్లం. పాటలకి డ్యాన్సులు అదరగొట్టారు. ఆ పాటలు మళ్లీమళ్లీ థియేటర్లోని వేయించుకునే వాళ్ళం. ఈరోజు మేము మీతో పాట తీస్తున్నాం సార్ అంటూ బుచ్చిబాబు తన ప్రేమను రామ్ చరణ్ పై తెలిపాడు. ఈ వీడియో చాలా ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేసింది. 100 మిలియన్ వ్యూస్ ఈ పాటకు రావడం వెనక ఎంత కష్టం ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

Also Read: Bhagyashree Borse : వాళ్లతో కలిసి పని చేయాలని ఉంది, భాగ్యశ్రీ కోరిక నెరవేరుతుందా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×