E-Paper
Advertisement

Anudeep KV: సుమతో అనుదీప్ 100 కోట్ల సినిమా? దివాలా తీయడం ఖాయం

Anudeep KV: సుమతో అనుదీప్ 100 కోట్ల సినిమా? దివాలా తీయడం ఖాయం
Advertisement

Anudeep KV: పిట్టగోడ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు అనుదీప్ కేవి. అయితే ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ సినిమా కంటే ముందు నాగ్ అశ్విన్ అనుదీప్ తీసిన ఒక షార్ట్ ఫిలిం చూశారు. మిస్డ్ కాల్ అనే షార్ట్ ఫిలిం చూసి ఇతని రైటింగ్ చాలా బాగుంది అని ఫీలయ్యారు. ఆ తర్వాత అనుదీప్ దర్శకుడుగా నాగ అశ్విన్ ప్రొడ్యూసర్ గా సినిమా చేయాలి అని అప్పట్లోనే అనుకున్నారు. మొత్తానికి వీరి కాంబినేషన్లో జాతి రత్నాలు అనే సినిమా విడుదల మంచి సక్సెస్ సాధించింది.

మామూలుగా సినిమా బాగా తీసినందుకు దర్శకుడు పేరు రావడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ అనుదీప్ కె.వికి ప్రత్యేకంగా పేరు వచ్చింది. సుమ హోస్ట్ గా చేసిన క్యాష్ షో అప్పట్లో బాగా పాపులర్ అయింది. ఆ షో కి చాలామంది తమ సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నప్పుడు వస్తూ ఉంటారు. అలానే జాతి రత్నాలు చిత్ర యూనిట్ వచ్చింది. అందరూ నవీన్ పోలిశెట్టి సప్రైజ్ చేస్తాడు అనుకుంటే ప్రత్యేకంగా అనుదీప్ సర్ప్రైజ్ చేశాడు. అనుదీప్ ఆఫ్ లైన్ టైమింగ్ అదిరిపోయింది.

సుమతో 100 కోట్ల సినిమా

Advertisement

కేవలం టెలివిజన్ కి మాత్రమే కాకుండా ఓటిటిలో కూడా కొన్ని షోలు బాగా పాపులర్ అవుతున్నాయి. అటువంటి షో లలో చెఫ్ మంత్రా కూడా ఒకటి. అయితే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీజన్ 5 క్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. చీఫ్ గెస్ట్ గా జీవన్ రెడ్డి మరియు అనుదీప్ కేవి వచ్చారు. అనుదీప్ కేవీ వస్తే ఎంతలా సందడి ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

తనదైన శైలిలో అనుదీప్ విపరీతమైన కామెడీ చేశారు. అయితే నన్ను పెట్టి 100 కోట్లు సినిమా చేస్తే అనే టాపిక్ సుమ అడిగారు. మిమ్మల్ని పెట్టి వందకోట్ల సినిమా చేస్తే నేను దివాలా అనే టైటిల్ పెడతాను అంటూ అనుదీప్ చెప్పాడు.

Advertisement

మీరు ఈ సినిమాలో బీటెక్ స్టూడెంట్ కొంచెం పుస్తకం దూరంగా పెట్టి చదువుతూ ఉంటారు. ఎందుకు దూరంగా అని సుమ అడిగితే మీద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని సెటైర్లు వేశాడు అనుదీప్ కేవి.

ఫంకీ తో కం బ్యాక్ 

అనుదీప్ ప్రస్తుతం ఫంకీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విశ్వక్సేన్ ఈ సినిమాలో డైరెక్టర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా 2026లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా ఒకవైపు విశ్వక్సేన్, మరోవైపు అనుదీప్ కెవికి కూడా స్ట్రాంగ్ కం బ్యాక్ అవుతుంది అని చాలామంది అనుకుంటున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ బ్యానర్ కి సంబంధించి 2025లో వచ్చిన సినిమాలేవి కూడా ఊహించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. నాగ వంశీ డిస్ట్రిబ్యూషన్ చేసిన వార్ సినిమా కూడా ఊహించిన సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఆ సినిమా విషయంలో సక్సెస్ పక్కన పెడితే తీవ్రంగా నష్టాలు తీసుకువచ్చింది.

Also Read: Sundar C : రజనీకాంత్ ను పక్కనపెట్టి విశాల్ తో సినిమా, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×