E-Paper
Advertisement

Kollywood : రూ. 1.80 కోట్ల బకాయిల వివాదం.. స్టార్ హీరో పై చీటింగ్ కేసు నమోదు..

Kollywood : రూ. 1.80 కోట్ల బకాయిల వివాదం.. స్టార్ హీరో పై చీటింగ్ కేసు నమోదు..
Advertisement

Kollywood : తమిళ ఇండస్ట్రీలోని స్టార్ హీరో పై కేసు నమోదు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. డబ్బులు చెల్లించలేదని నిర్మాణ సంస్థతో పాటుగా ఆ సినిమాలో పనిచేసిన హీరోపై కూడా పోలీస్ కేసు నమోదు అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలానే కొన్ని కేసులు నమోదవడం విశేషం.. అయితే కోలీవుడ్ ఇలాంటి ఘటనలు కొన్ని రోజులుగా రిపీట్ అవుతూనే ఉన్నాయి.. ఇప్పుడు మరోసారి ఇదే చర్చ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటించిన చిత్రం ‘ అనంత్ కాడు ‘. ఈ మూవీ షూటింగ్ టైమ్ లో తీసుకున్న బకాయిలను అడిగితే తమ మేనేజర్ ను బెదించారని ఆరోపిస్తూ నిర్మాణ సంస్థ తో పాటుగా హీరో ఆర్య పై జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్ లో ఓ సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో కోలీవుడ్ లో కొత్త టెన్షన్ మొదలైంది.. హీరో ఆర్యను పోలీసులు అరెస్ట్ చేస్తారా? లేదా బకాయిలను చిత్రయూనిట్ చెల్లిస్తుందా? అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

హీరో పై చీటింగ్ కేసు నమోదు..

తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన క్రేజ్ ని పెంచుకుంటూ వచ్చిన ఆర్య ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.. గతంలో ఈ హీరో చేసిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతో అతనికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న ‘అనంతన్ కాడు’ అనే మలయాళ చిత్ర చిత్రీకరణ కోసం గతేడాది ఫిబ్రవరిలో జూబ్లీహిల్స్ వెంకటగిరిలో షూటింగ్ చేశారు.. అయితే అప్పుడు ఓ సంస్థ దగ్గర కెమెరాలు, లైట్లు అద్దెకు తీసుకున్నారట. అయితే ఆ అమౌంట్ ను తిరిగి చెల్లించని నేపథ్యంలో ఆ సంస్థ హీరో, నిర్మాణ సంస్థ పై చీటింగ్ కేసు పెట్టింది.. ఈ కేసుతో ఒక్కసారిగా తమిళ ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి.. మరి ఈ హీరో ని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.

రూ. 1.80 ఎగ్గొట్టిన నిర్మాణ సంస్థ..

Advertisement

‘అనంతన్ కాడు ‘ సినిమా షూటింగ్ కోసం అని వెంకటగిరి పరిధిలోని హైలాంకాలనీకి చెందిన ‘తాహెర్ సినీ టెక్నిక్’ సంస్థ నుండి షూటింగ్ కోసం డిజిటల్ కెమెరాలు, లైటింగ్ యూనిట్లను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తుంది. సదరు సంస్థ తన స్వంత ఖర్చులతో షూటింగ్ పరికరాలను హైదరాబాద్ నుండి కేరళలోని షూటింగ్ కు తరలించింది. అయితే మొత్తం రూ. 2. 12 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే కొంత అమౌంట్ నీ చెల్లించడంతో ప్రస్తుతం ఒకటి 1.80 కోట్లను చెల్లించాల్సి ఉంది. సినిమా విడుదలకు ముందే మొత్తం బకాయిలు చెల్లించి ‘నో డ్యూస్ సర్టిఫికేట్’ తీసుకుంటామని లిఖితపూర్వకంగా అంగీకరించినప్పటికీ, చిత్రబృందం ఆ మాట నిలబెట్టుకోలేదని బాధితులు పేర్కొన్నారు.. అయితే ఈ డబ్బులు గురించి తమ మేనేజర్ కిషోర్ ఆర్య ని అలాగే నిర్మాత వినోద్ ని సంప్రదిస్తే వాళ్లు డబ్బులు చెల్లించకపోగా బెదిరింపులకు దిగుతున్నారని ఆ ఫిర్యాదులో రాసుకొచ్చారు..ఈ నిజాలను దాచిపెట్టడం కోసం కేరళలోని న్యాయస్థానం నుండి వీరు మధ్యంతర ఉత్తర్వులు కూడా పొందినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.. ఈ కేసుని త్వరలోనే ఓ కొలిక్కి తీసుకురాబోతున్నాము అని పోలీసులు తెలుపుతున్నారు.. ఈ క్రమంలో ఆర్య ని అరెస్ట్ చేస్తారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×