E-Paper
Advertisement

జూబ్లీహిల్స్ లో స్థల కబ్జా యత్నం.. బడా ప్రొడ్యూసర్స్ సి.కళ్యాణ్, బి. శివరామకృష్ణపై కేస్ ఫైల్!

జూబ్లీహిల్స్ లో స్థల కబ్జా యత్నం.. బడా ప్రొడ్యూసర్స్ సి.కళ్యాణ్, బి. శివరామకృష్ణపై కేస్ ఫైల్!
Advertisement

Tollywood: జూబ్లీహిల్స్ లో స్థలం కబ్జా చేశారు అనే ఆరోపణలతో ఏకంగా ఇద్దరు బడా నిర్మాతలపై కేసు ఫైల్ అవ్వడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. అసలు వారు ఎవరు? ఏ స్థలం కబ్జా చేశారు? అసలు ఏం జరిగింది ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో స్థల కబ్జా యత్నం ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ సినీ నిర్మాతలు సి.కళ్యాణ్, బురుగుపల్లి శివరామకృష్ణతో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

also read:RAW NTR సంచలన నిర్ణయం.. సంస్థ మూసివేత!

భూ కబ్జాయత్నం కేసులో నిర్మాత సి.కళ్యాణ్

Advertisement

ఇకపోతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వీరిపై ప్రముఖ వ్యాపారవేత్త కంఠమనేని రవిశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదాస్పద స్థలం జూబ్లీహిల్స్ లోని ఉమెన్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ఫ్లాట్ నెంబర్ 89 గా ఆ స్థలాన్ని గుర్తించారు. ఇకపోతే వ్యాపారవేత్త కంఠమనేని రవిశంకర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. “ఈ భూమిపై ప్రస్తుతం కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా.. జూన్ 10న కోర్టు రవిశంకర్ స్వాధీనంలో ఉన్న భూమిలో ఎలాంటి జోక్యం చేసుకోరాదు అంటూ తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయినా సరే కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా నిందితులు అక్రమంగా స్థలంలోకి ప్రవేశించారు” అంటూ రవిశంకర్ తన ఫిర్యాదులో ఆరోపించారు.

విధుల్లో ఉన్న సిబ్బందిని బెదిరించిన వైనం..

ముఖ్యంగా స్థలంలోని తాళాలను పొగలుగొట్టి , ప్రధాన గేటును ధ్వంసం చేయడంతో పాటు అక్కడ ఉన్న సామాగ్రిని కూడా బయటికి విసిరేసారు అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని బెదిరించి, స్థలంలో నిర్మించిన గదిని కూడా ధ్వంసం చేశారు అంటూ రవిశంకర్ ఆరోపించారు. రవిశంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై దర్యాప్తు చేపట్టారు.

నిర్మాతలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..

Advertisement

ఇకపోతే వ్యాపారవేత్త కంఠమనేని రవిశంకర్ ఫిర్యాదును స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. సినీ నిర్మాతలు కళ్యాణ్ సి, బూరుగుపల్లి శివరామకృష్ణ తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అన్ని కోణాలలో విచారిస్తున్నట్లు స్పష్టం చేశారు. దర్యాప్తు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని రవిశంకర్ కి పోలీసులు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ స్థలం కబ్జా చేసే ప్రయత్నం సినీ ,రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై నిర్మాత కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×