E-Paper
Advertisement

Bullet Reddy: ‘బుల్లెట్ రెడ్డి’ ఏం చేస్తున్నాడో.. అప్డేట్ వచ్చేసింది!

Bullet Reddy: ‘బుల్లెట్ రెడ్డి’ ఏం చేస్తున్నాడో.. అప్డేట్ వచ్చేసింది!
Advertisement

Bullet Reddy: ఆది, మేఘ, హనిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘బుల్లెట్ రెడ్డి’ (Bullet Reddy). ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి ఫిలింస్ బ్యానర్ పై ఆది (Aadi) దర్శక నిర్మాతగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌‌ను జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్ర విశేషాలను తాజాగా హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో జరిగిన మీడియా దర్శక నిర్మాత హీరో ఆది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ ఖయ్యూం కూడా పాల్గొన్నారు.

Also Read- Action Thriller OTT : ఓటీటీలో దుమ్ము లేపుతున్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్… మాఫియాపై అలుపెరుగని పోరాటం… ట్రెండింగ్‌లోనూ తోపే

‘బుల్లెట్ రెడ్డి’ అప్డేట్ ఇదే.. (Bullet Reddy Update)

Advertisement

ఈ సందర్భంగా దర్శక నిర్మాత హీరో ఆది మాట్లాడుతూ.. ఈ చిత్రంలో హీరో బుల్లెట్ రెడ్డి వెయ్యి ఎకరాల జమీందారు‌. ఆయనకు చెందాల్సిన లక్షల కోట్ల రూపాయల విలువైన నిధిని దక్కించుకునేందుకు కొందరు దురాశ పరులు ఎలా ప్రయత్నించారు? ఆ ప్రయత్నాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రమిది. నాకున్న మార్షల్ ఆర్ట్స్‌లో ఉన్న ప్రావీణ్యం ఈ సినిమాలో నటించేందుకు కలిసొచ్చింది. దీనికి ఖయ్యూం మాస్టర్ బాగా సపోర్ట్ చేశారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌లో ఉన్నాం. ఆదిలాబాద్ అడవుల్లో పాట చిత్రీకరణ జరిపాం. అలాగే నిజామాబాద్‌లో ఫైట్ సీక్వెన్స్ రూపొందించాం. ఈ నెల 23వ తేదీ నుంచి రాజమండ్రి, అమలాపురం పరిసర ప్రాంతాల్లో నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఏప్రిల్ 5వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఆ తర్వాత గోవాలో జరిపే షెడ్యూల్‌లో పాటల చిత్రీకరణ జరిపి, చివరి షెడ్యూల్ మళ్లీ ఆదిలాబాద్, నిజామాబాద్‌లో చేస్తాం. ఈ ఏడాది దసరా పండుగ స్పెషల్‌గా అక్టోబర్ 16న మా మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఏపీకి చెందిన తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నాం. త్వరలోనే మరిన్ని విషయాలు తెలియజేస్తామని తెలిపారు.

Also Read- Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో వద్దు అని ఇంట్లో వాళ్ళు పెద్ద రచ్చ వేసుకున్నారు.. రష్మిక కీలక వ్యాఖ్యలు..!

నా శిష్యుడికి ఫ్యాన్ అయిపోయా..

Advertisement

ఫైట్ మాస్టర్ ఖయ్యూం మాట్లాడుతూ.. నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. ఆది ఉండేది మా పొరుగు ఊరులోనే. అంతేకాదు, ఆది నాకు శిష్యుడు కూడా. ఈ సినిమా కోసం అతను పడే కష్టం చూసి అతనికి అభిమానిని అయ్యాను. ఈ మూవీలో ఆది ఎంత కష్టపడ్డాడో తెరపై చూస్తారు. మంచి ఫైట్స్, ఎంటర్ టైన్‌మెంట్, ఆకట్టుకునే పాటలతో ‘బుల్లెట్ రెడ్డి’ సినిమా రూపుదిద్దుకుంటోంది. కచ్చితంగా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి కాబట్టి.. అందరికీ నచ్చుతుందని అన్నారు.

Also Read- Deewana Teaser: అది నా పిల్ల.. అది ఇది అని నేనంటా!.. ‘దీవాన’ టీజర్ ఎలా ఉందంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×