E-Paper
Advertisement

SPIRIT : సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాకి బ్రేక్, జపాన్ వెళ్తున్న ప్రభాస్ 

SPIRIT : సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాకి బ్రేక్, జపాన్ వెళ్తున్న ప్రభాస్ 
Advertisement

SPIRIT : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ ఒకటి. యానిమల్ తర్వాత సందీప్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కాబట్టి విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. అంతేకాకుండా ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ గుర్తింపు ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడే విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు ప్రభాస్.

ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా విచ్చేసి ఆశీర్వదించారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్రెడీ మొదలైపోయింది. ఈ సినిమా షూటింగ్ నేటితో బ్రేక్ పడనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. కోటి ఉమెన్స్ కాలేజీలో ఈ షూటింగ్ మొదలుపెట్టారు. ప్రభాస్ మరియు హీరోయిన్ త్రిప్తి మధ్య కొన్ని సీన్స్ కూడా తీశారు. సినిమాకి సంబంధించి 80% వరకు మ్యూజిక్ కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగ లోకేషన్ లోనే మ్యూజిక్ ప్లే చేసి మరి సీన్స్ షూట్ చేస్తుంటారు.

స్పిరిట్ సినిమాకి బ్రేక్ 

Advertisement

రీసెంట్ గానే షూటింగ్ మొదలుపెట్టిన సందీప్ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు. సందీప్ రెడ్డి వంగ సినిమా మొదలుపెట్టడానికి టైం తీసుకుంటాడు గాని ఒకసారి షూటింగ్ మొదలైంది అంటే దానిని చాలా స్పీడ్ గా ఫినిష్ చేస్తాడు. స్వతహాగా సందీప్ రెడ్డి వంగ లో ఎడిటర్ ఉండటంతో ఏ సీన్ వరకు సరిపోతుందో, అనే క్లారిటీతో షూటింగ్ చేస్తూ ఉంటాడు. అందుకే యానిమల్ లాంటి సినిమాను కూడా కేవలం 100 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడు.

ఇకపోతే ప్రస్తుతం హీరో ప్రభాస్ జపాన్ కు బయలుదేరారు. ఈ సినిమాకి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ డిసెంబర్ 15వ తారీకు తర్వాత ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను 2026లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనయుడు మరియు రవితేజ కొడుకు కూడా పనిచేస్తున్నారు.

హై ఎక్స్పెక్టేషన్స్ 

Advertisement

ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ టీజర్ తోనే మంచి హైప్ క్రియేట్ అయిపోయింది. ప్రకాష్ రాజ్, వివేక్ ఓబెరాయ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు అని అనౌన్స్మెంట్ రాగానే ఈ సినిమా మీద క్యూరియాసిటీ మరింత పెరిగింది. అనిమల్ సినిమా మాదిరిగానే ఈ సినిమాలో మొత్తం 3 గెటప్స్ లో ప్రభాస్ కనిపించనున్నారు.

Also Read: Nagabandham : పెదకాపు హీరో కోసం భారీ బడ్జెట్, కేవలం క్లైమాక్స్ కోసమే 20 కోట్లు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×