E-Paper
Advertisement

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?
Advertisement

V.K.Naresh:ఘట్టమనేని వారసుడిగా, దివంగత నటుడు రమేష్ బాబు (Ramesh Babu) కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న జయకృష్ణ (Jaya Krishna) ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రవీనా టాండన్ (Raveena Tandon) కూతురు రషా తడానీ (Rasha Thadani) హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా ప్రెస్ మీట్ సందడిగా సాగింది. ఈ చిత్రంతో ఘట్టమనేని వారసుడు జయకృష్ణ నటన, కృష్ణగారి సినీ వారసత్వంపై నరేష్ పంచుకున్న అభిప్రాయాలు సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. అంతేకాదు ఈవెంట్లో వీకే నరేష్ (VK Naresh), నటుడు బ్రహ్మాజీ (Brahmaji)పై చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన స్టేజ్ దిగి వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. మరి వీకే నరేష్ బ్రహ్మాజీని ఏమన్నారు? ఎందుకు ఆయన స్టేజ్ దిగి వెళ్లిపోయారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

లెగసీ అనేది భారం కాదు.. ఒక బాధ్యత:

ప్రెస్ మీట్‌లో సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ.. జయకృష్ణను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని చెప్పారు. జయకృష్ణ ఎదుర్కొంటున్న కృష్ణగారి లెగసీ గురించి ప్రస్తావిస్తూ.. “లెగసీ అనేది ఎప్పుడూ భారం కాదు, అది ఒక పెద్ద బాధ్యత” అని స్పష్టం చేశారు. ఈ సినిమాలో పాటలు, హీరో హీరోయిన్ల మధ్య ఉండే ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఖాయమని నరేష్ ధీమా వ్యక్తం చేశారు.

అజయ్ భూపతి తిట్లు.. బ్రహ్మాజీ పై నరేష్ కామెంట్:

Advertisement

సినిమా షూటింగ్ విశేషాలను పంచుకుంటూ, దర్శకుడు అజయ్ భూపతి దగ్గర తాను చాలాసార్లు తిట్లు తినడానికి బ్రహ్మాజీయే కారణమని నరేష్ కామెంట్ చేశారు. “ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఉండొచ్చా? ఉండకూడదా? నాకైతే తెలియదు” అంటూ నరేష్ బ్రహ్మాజీపై కామెంట్లు చేశారు.

also read:బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

“నా పేరు పెట్టి వెళ్లొద్దు”.. నరేష్ కామెంట్స్:

Advertisement

నరేష్ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. బ్రహ్మాజీ స్టేజ్ పైనుంచి కిందకు వెళ్లిపోతుండగా, నరేష్ వెంటనే అందుకుని “హలో! నీకు పని ఉంటే వెళ్లిపో.. కానీ నా పేరు పెట్టి వెళ్లొద్దు. నీకు వేరే సినిమా షూటింగ్ ఉందనే వెళ్తున్నావని నాకు తెలుసు.. గడ్డం కూడా పెంచుతున్నావ్!” అంటూ ఆటపటాయించారు. దాంతో బ్రహ్మాజీ నవ్వుకుంటూ మళ్లీ స్టేజ్‌పైకి వెళ్లడంతో అక్కడ అంతా నవ్వుల పూవులు పూసాయి.

ఘట్టమనేని కుటుంబ వారసుడు జయకృష్ణ హీరోగా, ఆకట్టుకునే కథనాలతో మెప్పించే దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ కథానాయికగా నటిస్తుండగా, ఇప్పటికే విడుదలైన ట్రైలర్,పాటలు సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఈ నెల 30న థియేటర్లలోకి రానుంది.

‘శ్రీనివాస మంగాపురం’పై పెరిగిన అంచనాలు: 

జయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంపై చిత్ర బృందం ఎంతో నమ్మకంతో ఉంది. సీనియర్ నటులు నరేష్, బ్రహ్మాజీల మధ్య ఉన్న మంచి స్నేహం, ఈ ప్రెస్ మీట్‌లో వారు పంచిన ఫన్ వాతావరణం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సరదా సన్నివేశాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×