E-Paper
Advertisement

Akhanda 2 : అఖండ 2 లో బోయపాటి శ్రీను కొడుకు, బాగానే ట్రైనింగ్ ఇచ్చాడు కానీ చివర్లో దొరికిపోయాడు

Akhanda 2 : అఖండ 2 లో బోయపాటి శ్రీను కొడుకు, బాగానే ట్రైనింగ్ ఇచ్చాడు కానీ చివర్లో దొరికిపోయాడు
Advertisement

Akhanda 2 : చాలామంది దర్శకులకు తమ కొడుకుల్ని నటుడుగా చూడాలి అనే కోరిక ఉండడం సహజంగా జరుగుతుంది. ఇప్పటికే గోపీచంద్ మలినేని కొడుకు గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో కనిపించాడు. ఇక తాజాగా అఖండ 2 సినిమాలో బోయపాటి శ్రీను కుమారుడు కనిపించనున్నాడు. ఈ ఈవెంట్ లో బోయపాటి శ్రీను కుమారుడు వర్షిత్ కూడా ఆసక్తికర స్పీచ్ ఇచ్చాడు.

ఆ వ్యక్తిని తన అబ్బాయి అని ముందుగానే పరిచయం చేయకుండా ఒక ఆర్టిస్టును మీకు పరిచయం చేస్తాను అని మైక్ ఇచ్చి మాట్లాడించారు బోయపాటి శ్రీను. వర్షిత్ మాట్లాడుతూ తన మాటలతో అందరినీ ఆకట్టుకున్నాడు.

బోయపాటి ట్రైనింగ్ 

Advertisement

నా పేరు బోయపాటి వర్షిత్, నేను ఈ సినిమాలో నటించాను. బాలకృష్ణ అన్నతో నటించటం నాకు చాలా ఆనందంగా ఉంది. బోయపాటి శ్రీను గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బోయపాటి సరికి వెరీ థాంక్యూ. జై బాలయ్య అంటూ తన స్పీచ్ ఇచ్చాడు. అయితే చివర్లో అంతేనా నాన్న ఇంకేమైనా చెప్పాలా అంటూ బోయపాటి శ్రీను అని అడిగాడు వర్షిత్. వర్షిత్ మాటలను బట్టి చూస్తే బోయపాటి శ్రీను మాట్లాడించినట్లు అర్థమైపోతుంది.

తప్పించుకునే ప్రయత్నం 

Advertisement

అయితే అంత స్పీచ్ అయిపోయిన తర్వాత బోయపాటి శ్రీను మాట్లాడుతూ నన్ను అడుగుతున్న వేంటిరా. మొత్తానికి బోయపాటి శ్రీను అలా అన్నా కూడా అతని ట్రైనింగ్ అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక అఖండ సినిమాలో ఎంతటి కీలకపాత్రను తన కుమారుడి కోసం డిజైన్ చేశాడో చూడాలి. అయితే బోయపాటి శ్రీనుకి మొత్తం ఇద్దరు కుమారులు వారిలో ఈ రెండో వాడు వర్షిత్.

ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. రీసెంట్ లో బాలకృష్ణ చేస్తున్న అన్ని సినిమాలకు తమన్ మాత్రమే సంగీతం ఇస్తున్నారు. ఒక మామూలు సినిమాని తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లడం తమన్ మ్యూజిక్ ఉన్న ప్లస్.

Also Read: Akhanda 2 Event : నాకు చాలా వర్క్స్ ఉన్నాయి కానీ ఒకరే భార్య, పవన్ కళ్యాణ్ కు బాలయ్య కౌంటర్?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×