E-Paper
Advertisement

Boyapati: అఖండ 2 తర్వాత మరో భారీ సీక్వెల్‌పై ఫోకస్ పెట్టిన బోయపాటి..!

Boyapati: అఖండ 2 తర్వాత మరో భారీ సీక్వెల్‌పై ఫోకస్ పెట్టిన బోయపాటి..!
Advertisement

Boyapati: టాలీవుడ్‌లో మాస్ యాక్షన్ సినిమాలంటే చాలా మంది ముందుగా గుర్తుకు తెచ్చుకునే దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన తీసిన సినిమాలు సాధారణంగా భారీ యాక్షన్ సన్నివేశాలు, శక్తివంతమైన హీరో పాత్రలు, థియేటర్లలో అభిమానులను ఉత్సాహపరిచే డైలాగులతో ఉంటాయి. అందుకే బోయపాటి సినిమాలకు మాస్ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. బాలకృష్ణతో వరుస విజయాలు అందుకున్న ఏ దర్శకుడు ఈమధ్య మాత్రం అఖండ 2 సినిమాతో పరాజయం చవిచూశారు.

ఆ సినిమాకి సీక్వెల్..!

ఈ క్రమంలో బోయపాటి శ్రీను తదుపరి సినిమా గురించి సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. గతంలో పలు పెద్ద యాక్షన్ సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కథపై పని చేస్తున్నారని సమాచారం. గత కొద్ది నెలలుగా ఆయన ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు అనే విషయంపై అనేక రకాల వార్తలు వినిపించాయి. కొందరు తమిళ స్టార్ హీరోతో సినిమా ఉంటుందని చెబుతుండగా, మరికొందరు బాలీవుడ్ హీరోతో కలిసి సినిమా చేయవచ్చని ప్రచారం చేశారు.

Advertisement

తాజా సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను త్వరలో బాలీవుడ్ సినిమా జాట్ సీక్వెల్‌ను తెరకెక్కించే అవకాశం ఉందని చెబుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన జాట్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇప్పుడు ఈ సినిమాకు జాట్ 2 రూపంలో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని, దానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే అవకాశముందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. సన్నీ డియోల్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు బోయపాటి మాస్ యాక్షన్ స్టైల్ కలిస్తే ఈ సినిమా మరింత పెద్ద స్థాయిలో ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు.

కథ సిద్ధం.‌!

Advertisement

ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలో ఉందని సమాచారం. పెద్ద బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందించే ఆలోచన ఉందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను కథ.. స్క్రీన్‌ప్లే పై పని చేస్తున్నారని అంటున్నారు. సన్నీ డియోల్ ఇమేజ్‌కు సరిపోయేలా హై వోల్టేజ్ యాక్షన్ కథను సిద్ధం చేస్తున్నారని టాక్.

అన్నీ సవ్యంగా జరిగితే టాలీవుడ్ దర్శకుడు మరియు బాలీవుడ్ స్టార్ హీరో కలయికలో ఒక భారీ మాస్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అది వచ్చిన తరువాతే ఈ సినిమా పై పూర్తి స్పష్టత రానుంది.

ALSO READ: Dhurandhar 2: ధురంధర్ 2 నుంచీ “ఆరి ఆరి” టైటిల్ ట్రాక్.. బీట్స్ అదిరిపోలా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×