E-Paper
Advertisement

Akhanda 2 : అఖండ 2 సాంగ్ వచ్చేసింది, ఇక థియేటర్స్ లో శివతాండవమే 

Akhanda 2 : అఖండ 2 సాంగ్ వచ్చేసింది, ఇక థియేటర్స్ లో శివతాండవమే 
Advertisement

Akhanda 2 : భద్ర సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన బోయపాటి శ్రీను సింహా సినిమాతో విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు. బోయపాటి శ్రీను కెరియర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా బాలకృష్ణతో చేసిన సినిమాలు కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి. అలానే బాలకృష్ణను బోయపాటి శ్రీను చూపించినంత పవర్ఫుల్ గా ఇంకో దర్శకుడు చూపించలేడు అనేది కూడా వాస్తవం. బాలకృష్ణతో బోయపాటి శ్రీను అంటేనే ఒక కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుంది.

కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కాకుండా కొంత మేరకు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంటాడు బోయపాటి శ్రీను. ఇప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ సినిమాలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ మొదటి సింగిల్ సాంగ్ విడుదల చేసింది.

అఖండ ఫస్ట్ సింగిల్ 

Advertisement

అఖండ తాండవం అని మొదలయ్యే ఈ పాట పవర్ఫుల్ గా ఉంది. కళ్యాణ్ చక్రవర్తి ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. ఈ పాటలో కొన్ని సీన్స్ తో పాటు మేకింగ్ వీడియోస్ కూడా యాడ్ చేశారు. ముఖ్యంగా శివ భక్తితో కూడుకున్న ఈ పాట పూనకాలు తెప్పిస్తుంది. ఈ పాటను కైలాష్ ఖేర్ మరియు శంకర్ మహదేవన్ పాడారు. ఈ పాట కోసం రచయిత కళ్యాణ్ చక్రవర్తి క్లిష్టమైన పదాలను వాడారు. ఈ పాట వింటుంటే ఒక రకమైన భక్తి భావం పుడుతుంది.

తమన్ విశ్వరూపం 

Advertisement

బాలకృష్ణ బోయపాటి శ్రీను అంటే తమన్ కి పైనుంచి ఏమైనా శక్తులు పూనుతాయేమో అనిపిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ కి తమన్ ఇచ్చే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక ఈ పాటను కూడా నెక్స్ట్ లెవెల్ లో డిజైన్ చేశాడు. అప్పట్లో థియేటర్లో బాక్సులు బద్దలైపోతున్నట్లు కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. ఈ పాటను వింటుంటే ఈ సినిమాతో అటువంటి కంప్లైంట్స్ ఇంకా రెట్టింపు అవుతాయేమో అనే సందేహం కలుగుతుంది.

కేవలం పాటని ఈ రేంజ్ లో కొట్టాడు అంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్ లో ఇచ్చి ఉంటాడు అని ఊహకు కూడా అందటం లేదు. మొత్తానికి డిసెంబర్ 5న థియేటర్లో శివతాండవం ఖాయం అని అనిపిస్తుంది.

Also Read: Comedian Satya : పోస్టర్ తోనే కితకితలు పెట్టాడు , రితీష్ రానా నీ వెటకారం మామూలుది కాదు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×