E-Paper
Advertisement

Dragon Update: ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు ఎంట్రీ.. డిజాస్టర్ సెంటిమెంట్ ఫాలో కానుందా..!

Dragon Update: ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు ఎంట్రీ.. డిజాస్టర్ సెంటిమెంట్ ఫాలో కానుందా..!
Advertisement

Dragon Update: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా..స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ సినిమా డ్రాగన్ పై.. భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో మంచి హైప్ నెలకొంది. తాజాగా ఈ సినిమాకు బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ చేరడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

గత కొన్నేళ్లుగా టాప్ తెలుగు హీరోలకు ఎదురుగా.. విలన్ గా.. హిందీ నటులను తీసుకోవడం ట్రెండ్‌గా మారింది. నీల్నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ లాంటి నటులతో మొదలైన ఈ ట్రెండ్.. తర్వాతి పెద్ద సినిమాల్లో కూడా కొనసాగింది. అదే కోవలో ఇప్పుడు ‘డ్రాగన్’ సినిమాలో అనిల్ కపూర్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిని పెంచింది.

Advertisement

అయితే అనిల్ కపూర్ పాత్ర గురించి మేకర్స్ ఇప్పటివరకు పూర్తి వివరాలు వెల్లడించలేదు. కానీ సినిమా కథలో కీలకమైన మలుపు దగ్గర ఆయన పాత్ర ఉంటుందని సినీ వర్గాల సమాచారం. పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథపై ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఉన్న గౌరవంతోనే.. అనిల్ కపూర్ ఈ పాత్రకు ఒప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ కాంబినేషన్ గురించి మాట్లాడితే అభిమానులకు వెంటనే వార్ 2 గుర్తుకు వస్తోంది. ఆ సినిమాలో అనిల్ కపూర్, ఎన్టీఆర్‌కు బాస్‌గా కనిపించారు. కానీ ఆ పాత్రకు సరైన బలం లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియాలో ఆ సీన్స్‌పై ట్రోలింగ్ కూడా జరిగింది. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్’లో ఇదే కాంబినేషన్ మళ్లీ కనిపించడంతో సందేహాలు మొదలయ్యాయి.

Advertisement

కానీ వార్ 2తో పోలిస్తే డ్రాగన్.. పూర్తిగా రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుందని సమాచారం. ప్రశాంత్ నీల్ సినిమాల్లో పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని తెలిసిందే. అందువల్ల ఈసారి అనిల్ కపూర్ పాత్రకు గట్టిన ఇంపాక్ట్ ఉండొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.

డ్రాగన్ లో అనిల్ కపూర్ చేరడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈసారి ఈ కాంబినేషన్ హిట్ అవుతుందా? లేక ‘వార్ 2’ లాంటి అనుభవమే మళ్లీ ఎదురవుతుందా? అన్నది సినిమా విడుదలయ్యే వరకు చూడాల్సిందే.

ALSO READ: Nayanthara: కలిసిన రెండు ధ్రువాలు.. కలకాలం కలిసి ఉంటాయా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×