E-Paper
Advertisement

Akshay kumar : బాలీవుడ్ హీరో కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు..

Akshay kumar : బాలీవుడ్ హీరో కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు..
Advertisement

Akshay kumar : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం జరిగింది.. ముంబైలో ఆయన భార్యతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో కారు ప్రమాదానికి గురైంది. తన భార్యతో కలిసి విదేశాలకు వెళ్లిన ఆయన ఆ పర్యటనను ముగించుకొని తిరిగి ఇండియాకి వచ్చారు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్ట్ నుంచి వేగంగా అక్షయ్ కారు బయలుదేరింది. జూహు సమీపంలోకి రాగానే యాక్సిడెంట్ కు గురైంది. అక్షయ్ కుమార్ సెక్యూరిటీ వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టింది. దాంతో అక్షయ్ కుమార్ కారును ఢీకొట్టింది. కార్లు అతి వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. అక్షయ్ కుమార్ ఆయన భార్య ట్వింకిల్ కన్నా ఆ కారులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదానికి గురైన సమయంలో ఆయన కారులోని ఎయిర్ బాగ్స్ ఓపెన్ అవడంతో అక్షయ్ కుమార్ దంపతులు క్షేమంగా బయటపడ్డారని తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో వీరిద్దరికీ స్వల్ప గాయాలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మీరు పరిస్థితి ఎలా ఉందో మరి కాసేపట్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు కాసేపట్లో తెలియనున్నాయి..

ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్తుండగా ప్రమాదం.. 

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన భార్యతో కలిసి విదేశాలకు వెళ్లాడు. అనంతరం ముంబైకు చేరుకున్నాడు.. ఎయిర్ పోర్ట్ నుంచి జూహు లోని తన నివాసంకు వెళ్తున్న సయమంలో ఈ తన కారుకు ప్రమాదం జరిగింది. జుహులోని సిల్వర్ బీచ్ కేఫ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన మెర్సిడెస్ కారు తొలుత ఒక ఆటో రిక్షాను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఆటో పక్కనే ఉన్న అక్షయ్ కుమార్ సెక్యూరిటీ వాహనంపైకి దూసుకెళ్లింది. ఇలా ఒకదాని వెనుక ఒకటి వాహనాలు ఢీకొనడంతో ఆ ప్రాంతంలో భారీ శబ్దం వినిపించింది. వెంటనే అప్రమత్తం అయిన హీరో ఆటోలోని బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. ఆటోలో డ్రైవర్, ప్రయాణికుడు చిక్కుకుపోయారు.అక్షయ్ తన సిబ్బందితో కలిసి స్వయంగా ఆటోను పైకి లేపి, లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. అక్షయ్ చేస్తున్న పనికి అక్కడున్న జనాలు ఫిదా అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన ఆయన అభిమానులు మా హీరో గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

పెళ్లిరోజు నాడే ప్రమాదం జరిగింది.. 

Advertisement

బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖాన్నా పెళ్ళై సరిగ్గా 25 సంవత్సరాలు అయ్యింది.. తమ 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి విదేశాలకు వెళ్లారు. అక్కడ వేడుకలు ముగించుకుని ముంబైలో అడుగుపెట్టిన గంటల వ్యవధిలోని ఈ భారీ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో అక్షయ్ కుమార్ తృటిలో తప్పించుకున్నారు. ఈ వార్త ప్రస్తుతం బాలీవుడ్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×