E-Paper
Advertisement

ఘనంగా బండ్ల గణేష్ కూతురి నిశ్చితార్థం… హాజరైన సినీ ప్రముఖులు!

ఘనంగా బండ్ల గణేష్ కూతురి నిశ్చితార్థం… హాజరైన సినీ ప్రముఖులు!
Advertisement

Bandla Ganesh Daughter: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హడావిడి మొదలైంది. ఇప్పటికే ఎంతోమంది హీరోలు హీరోయిన్లు పెళ్లి చేసుకొని పెళ్లి పీటలు ఎక్కారు. ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈయన వివాహం పూర్తి అయిన వెంటనే స్టార్ ప్రొడ్యూసర్ ఏసియన్ సునీల్ కుమార్తె వివాహపు వేడుకలు జరిగాయి. ఇక తాజాగా మరో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్(Bandla Ganesh) కుమార్తె జనని నిశ్చితార్థం(Janani Engagment) వేడుకలు కూడా నేడు హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరిగింది. బండ్ల గణేష్ కుమార్తె జనని సూర్యతేజ(Surya Teja) చిలుకూరితో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

చంద్రబాబు దంపతుల చేతులమీదుగా..

బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థపు వేడుకలో భాగంగా సినీ సెలబ్రిటీలందరూ కూడా పాల్గొని సందడి చేశారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు ముఖ్య అతిథులుగా ఈ నిశ్చితార్థపు వేడుక జరిగింది. చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతుల చేతులమీదుగా వధూవరులకు ఉంగరాలను అందచేశారు. ఇలా ఎంతో అంగరంగ వైభవంగా ఈ నిశ్చితార్థపు వేడుక జరిగింది. ఈ నిశ్చితార్థపు వేడుకల్లో భాగంగా నటుడు శివాజీ బ్రహ్మానందం మెగాస్టార్ చిరంజీవి దంపతులు వంటి తదితరులు పాల్గొన్నారు.

జనని సూర్యతేజ నిశ్చితార్థం..

Advertisement

ప్రస్తుతం వీరి నిచ్చితార్థపు వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బండ్ల గణేష్ కాబోయే అల్లుడు సూర్య తేజ చిలుకూరి కుటుంబానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని తెలుస్తుంది. గత కొద్ది నెలల క్రితం బండ్ల గణేష్ తన ఇంట్లో పసుపు కుంకుమ వేడుకలు నిర్వహించి తనకు కాబోయే అల్లుడిని అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తన అల్లుడిని పరిచయం చేసిన బండ్ల గణేష్ నేడు కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపించారు. ఇక త్వరలోనే జనని సూర్య తేజ పెళ్లికి సంబంధించిన వివరాలను తెలియజేయనున్నారు. ప్రస్తుతం ఈ నిశ్చితార్థపు ఫోటోలు వీడియోలు వైరల్ గా మారడంతో కొత్త జంటకు బండ్ల గణేష్ అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.

also read:Kissik Talks: ప్రతి అమ్మాయికి ఆ సపోర్టు ఉండాలి – ప్రియా శెట్టి

నిర్మాతగా బండ్ల గణేష్ సక్సెస్..

Advertisement

బండ్ల గణేష్ విషయానికి వస్తే ఈయన కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇలా స్టార్ హీరోలు అందరిని సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ అనంతరం నిర్మాతగా మారారు. బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ ,ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా ప్రొడ్యూసర్ గా మంచి సక్సెస్ అందుకున్న బండ్ల గణేష్ ఉన్నఫలంగా సినిమాలకు దూరమయ్యారు. ఇది వరకే ఈయన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను చేశారు.ఇక గత ఏడాది ఈయన BG బ్లాక్‌బస్టర్స్ అనే మరో నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Also Read: మేము కాపులం’ టైటిల్ వివాదం పై గెటప్ శ్రీను క్లారిటీ.. అసలు విషయం ఇదే అంటూ!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×