E-Paper
Advertisement

Madhavi Latha: రాజమౌళికి బీజేపీ నేత స్ట్రాంగ్ కౌంటర్.. అప్పుడు చేసింది ఏం లేదు.. ఇప్పుడు ఎందుకు ఇదంతా.. ?

Madhavi Latha: రాజమౌళికి బీజేపీ నేత స్ట్రాంగ్ కౌంటర్.. అప్పుడు చేసింది ఏం లేదు.. ఇప్పుడు ఎందుకు ఇదంతా.. ?
Advertisement

Madhavi Latha: దర్శక ధీరడు రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ ని ఖరారు చేసిన విషయం కూడా విదితమే. ఎప్పటినుంచో అభిమానులు వారణాసి సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు టైటిల్ ని  అనౌన్స్ చేస్తారా అని ఎదురుచూసిన అభిమానులకు జక్కన్న గ్లోబ్ ట్రోటర్ పేరుతో ఒక ఈవెంట్ ని నిర్వహించి అందులో టైటిల్ పేరు వారణాసి అని చెప్పుకొచ్చారు.

ఇక ఈవెంట్ గొప్పగా జరగకపోయినా కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు అని చెప్పొచ్చు. అయితే ఈవెంట్లో రాజమౌళి చేసిన ఒక చిన్న తప్పు ప్రస్తుతం వారణాసి సినిమాను బ్యాన్ చేయాలి అని డిమాండ్ చేసేదాకా వచ్చింది. ఈ  ఈవెంట్లో రాజమౌళి హనుమంతుడిని  అవమానించాడు అంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నారు . వారణాసి గ్లింప్స్ రాకపోవడంతో అసహనానికి గురైన జక్కన్న మా నాన్న హనుమంతుడు ఉన్నాడు.. ఆయనే అన్ని వెనక నుండి నడిపిస్తూ ఉంటాడు అని చెప్పారు. కానీ, ఇదేనా నడిపించేది అని అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

దీంతో చాలామంది రాజమౌళికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. దేవుడు సినిమాలు తీస్తూ.. కోట్లు సంపాదిస్తూ కూడా దేవుడిపై నిందలు వేస్తున్నారు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రాజమౌళి క్షమాపణ చెప్పాలి లేదా సినిమాను బ్యాన్ చేస్తాం అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పటివరకు రాజమౌళి ఈ వివాదంపై స్పందించలేదు. తాజాగా బీజేపీ నేత మాధవి లత సైతం ఈ వివాదంపై స్పందించింది.  బాహుబలి సినిమాలో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించారు ఆ డబ్బులు ఏమైనా శివుడికి ఇచ్చారా..?  అప్పుడు ఏమి చేయలేదు ఇప్పుడు ఎందుకు హనుమంతుని తిడుతున్నారు అంటూ రాజమౌళికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

“అయ్యా.. రాజమౌళి గారు .. మీకు ఇబ్బంది కలిగింది. ఈ వీడియో రకరకాలుగా వెళ్ళింది. ఎవరి బాధలు వారికి ఉంటాయి. నేను కాదనడం లేదు. కానీ, ఆంజనేయ స్వామి వెనుకుండి నడిపిస్తాడుఅని మీ అన్నగారు అన్నారు. కానీ, అది ఇప్పుడు భావ్యంగా అనిపించడం లేదు అని అన్నారు కదా. పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండీ.. శివలింగాన్ని ఎత్తించి ప్రభాస్ తో.. అప్పుడేమైనా దాండకం చదివారా..  శివాలయానికి ఏమైనా దానధర్మాలు చేశారా.. ఆరోజు చేసింది ఏం లేదు.. ఈరోజు తిట్టుకోవడం ఎందుకండీ.

Advertisement

కులవృత్తిలో వ్యక్తులు.. కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులు.. కంసాలివాడు.. ఆ కంసాలి వస్తువులను, డాక్టర్.. తానూ సర్జరీతో వాడే వస్తువులను దైవంగా భావిస్తాడు. భగవంతుడిని డబ్బు సంపాదనకు వాడుకోండి కాదనడం లేదు. కనీసం డబ్బు సంపాదనకు ఉపయోగపడ్డాడు భగవంతుడు అని గౌరవించడం మీలాంటివాళ్లకు.. మాలాంటివాళ్లకు సామజిక స్ఫూర్తిగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు మనల్ని చూసి.. మన మాట విని చైతన్యవంతులు అవుతారు. ఎవరో డ్రోన్స్ కొట్టేశారని బేలగా.. ఆంజనేయ స్వామి లేడని మాట్లాడడం.. ఆ తరువాత సమస్య తీరగానే వీడియో వేసేసుకోవడం.. ఇంకా నిలకడ ఎక్కడ ఉంది రాజమౌళి గారు మీకు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.  మరి ఈ సమస్య పెద్దది కాకముందే జక్కన్న దీనికి ఫుల్ స్టాప్ పెడితే బావుంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×