E-Paper
Advertisement

Chikoti Praveen: రాజమౌళి గాడికి కళ్ళు నెత్తికెక్కాయి.. మళ్లీ ఫైర్ అయిన చికోటి ప్రవీణ్!

Chikoti Praveen: రాజమౌళి గాడికి కళ్ళు నెత్తికెక్కాయి.. మళ్లీ ఫైర్ అయిన చికోటి ప్రవీణ్!
Advertisement

Chikoti praveen: చికోటి ప్రవీణ్ బీజేపీ నేతగా అందరికీ ఎంతో సుపరిచితమే. ఇక ఈయన ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి(Rajamouli) గురించి చికోటి ప్రవీణ్ (Chikoti Praveen)చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. గత కొద్ది రోజుల క్రితం రాజమౌళి ఏర్పాటు చేసిన గ్లోబ్ ట్రాటర్(Globe Trotter) కార్యక్రమంలో భాగంగా కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడంతో రాజమౌళి దేవుడి గురించి మాట్లాడుతూ నాకు దేవుడు పైన నమ్మకం లేదని మాట్లాడారు ఈ వ్యాఖ్యలు కాస్త తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై ఎంతోమంది విమర్శలు కురిపిస్తూ రాజమౌళి క్షమాపణలు చెప్పాలని కోరారు.

క్షమాపణలు చెప్పాలని సోయి లేదా..

చికోటి ప్రవీణ్ సైతం ఈ వివాదం పై స్పందిస్తూ ఏకంగా రాజమౌళిని ఉద్దేశించి నాస్తిక కుక్కలు అంటూ గతంలో మాట్లాడారు. మదం ఎక్కిన ఏనుగు మురికి కాలవలో పడ్డట్టు రాజమౌళి తీరు ఉందని, రాజమౌళి దేవుళ్ల గురించి చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలి అంటూ ఈయన గతంలో ఒక వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా రాజమౌళి క్షమాపణలు చెప్పకపోతే హిందూ సమాజం క్షమించదని వార్నింగ్ ఇచ్చారు. ఇలా ప్రవీణ్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ రాజమౌళి మాత్రం ఎక్కడా కూడా ఈ వివాదం పై స్పందించలేదు.

Advertisement

రాజమౌళి గాడు అంటున్నారు..

ఇకపోతే తాజాగా చికోటి ప్రవీణ్ మరోసారి ఇదే వివాదం గురించి రాజమౌళి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి దేవుడి గురించి చేసిన వ్యాఖ్యల పట్ల బుద్ధి తెచ్చుకొని క్షమాపణలు కోరుతారని అనుకున్నాము కానీ అలా క్షమాపణలు చెప్పలేదు కళ్ళు తలపైకి ఎక్కి క్షమాపణలు చెప్పాలనే సోయి కూడా లేనట్టుంది అంటూ వ్యాఖ్యానించారు. రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యల కారణంగా రాజమౌళి గారు నుండి ఇప్పుడు రాజమౌళి గాడు అంటున్నారని ప్రవీణ్ మండిపడ్డారు. ఇప్పటికైనా రాజమౌళి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి అంటూ చికోటి ప్రవీణ్ డిమాండ్ చేశారు.

Advertisement

రాజమౌళికి మద్దతుగా సెలబ్రిటీలు…

ఇలా చికోటి ప్రవీణ్ మరోసారి రాజమౌళి గురించి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రదుమారం రేపుతున్నాయి. ఈ వివాదం గురించి రాజమౌళి పై కేసులు నమోదు అయ్యాయి, హిందూ సంఘాల నేతలు కూడా మండిపడ్డారు. ఇలా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ రాజమౌళి మాత్రం ఎక్కడా కూడా ఈ ఘటనపై స్పందించకపోవడం గమనార్హం. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు మాత్రం రాజమౌళి వివాదం గురించి మాట్లాడుతూ రాజమౌళి మాట్లాడిన మాటలలో తప్పులేదని ఆయన దేవుడిని నిందించలేదు దేవుడిపై అలిగారు అంటూ కామెంట్లు చేశారు. ఇక రాజమౌళి మాత్రం స్పందించకుండా తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. వారణాసి చిత్ర బృందం కూడా ఈ ఘటనపై ఎక్కడ స్పందించలేదు.

Also Read: Uppal Balu: శివజ్యోతి తిరుమల వివాదంపై ఉప్పల్ బాలు కామెంట్స్..ఇలా అనేశాడేంటీ?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×