E-Paper
Advertisement

వీర జవాన్ మురళి నాయక్ మొదటి వర్ధంతి..బైక్ ర్యాలీలో పాల్గొన్న బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ!

వీర జవాన్ మురళి నాయక్ మొదటి వర్ధంతి..బైక్ ర్యాలీలో పాల్గొన్న బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ!
Advertisement

Gautham Krishan: గౌతమ్ కృష్ణ పరిచయం అవసరం లేని పేరు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గౌతమ్ కృష్ణ (Gautham Krishna)ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ప్రస్తుతం వీర జవాన్ మురళి నాయక్ (Murali Nayak)బయోపిక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అనంతపురం జిల్లాకు చెందిన జవాన్ మురళి నాయక్ గత ఏడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఈయన వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.

మురళి నాయక్ ప్రథమ వర్ధంతి..

Advertisement

ఇలా మురళి నాయక్ మరణించడంతో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు మురళి నాయక్ కుటుంబానికి అండగా నిలిచారు. ఇక మురళి నాయక్ మరణంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ అతని స్వగ్రామం అయిన కల్లితాండకు వెళ్లి తన తల్లి దండులను ఓదార్చడమే కాకుండా తన ఇంటి కొడుకుగా బాధ్యతలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇక మురళి నాయక్ తల్లిదండ్రులు కూడా గౌతమ్ కృష్ణలో తమ కొడుకుని చూసుకుంటున్నాము అంటూ తెలియజేశారు. ఇకపోతే మురళి నాయక్ మరణించి సరిగ్గా ఏడాది కావడంతో గౌతమ్ కృష్ణ తన మొదటి వర్ధంతి వేడుకలలో పాల్గొన్నారు.

బైక్ ర్యాలీ నిర్వహించిన గౌతమ్ కృష్ణ..

ఈ నేపథ్యంలోనే వీర జవాన్ మురళి నాయక్ సమాధిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం బైక్ ర్యాలీ నిర్వహిస్తూ వీర జవాన్ మురళి నాయక్ నివాళులు అర్పించారు. మురళి నాయక్ చదివిన కాలేజీ ఆధ్వర్యంలో, ఆయన స్నేహితులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. జోహార్ మురళి నాయక్ అంటూ నినాదాలతో ఈ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశం కోసం శత్రుదేశాలతో పోరాటం చేస్తూ పిన్న వయసులోనే తనువు చాలించిన మురళి నాయక్ మరణం పట్ల దేశం మొత్తం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. ఇలాంటి గొప్ప వారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని వారి గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో మురళి బయోపిక్ సినిమా చేయటానికి సిద్ధమయ్యారు.

Advertisement

మురళి నాయక్ బయోపిక్ సినిమాలో గౌతమ్ కృష్ణ..

ఇక ఈ బయోపిక్ సినిమాలో బిగ్ బాస్ గౌతమ్ మురళి నాయక్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై కె.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సినిమాని ఒక భాషకు మాత్రమే పరిమితం చేయకుండా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో భాషలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Also Read: నేరుగా ఓటీటీలోకి రాబోతున్న రాశీ ఖన్నా యాక్షన్ డ్రామా ‘లుక్కే’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×