E-Paper
Advertisement

Bigg Boss 9 Promo : నీ గేమ్ ఏముందో రీతూ? పవన్ తో ప్యాచప్ అవుతావ్, మరోసారి సంజన వర్సస్ రీతు

Bigg Boss 9 Promo : నీ గేమ్ ఏముందో రీతూ? పవన్ తో ప్యాచప్ అవుతావ్, మరోసారి సంజన వర్సస్ రీతు
Advertisement

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ 9, 12వ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 11 వారాలు కూడా కొంతమేరకు ఆసక్తి కానీ సాగాయి. అయితే 12వ వారంలో భాగంగా చాలామంది ఎక్స్ హౌస్ మేట్స్ లోపలికి ఎంట్రీ ఇచ్చి లోపల ఉన్న వాళ్ళతో గేమ్స్ ఆడారు. ఈ గేమ్స్ అన్నీ కూడా కేవలం కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగాయి. కెప్టెన్సీ టాస్క్ ఆడడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత సాధించడానికి అప్పట్లో హౌస్ మేట్స్ తో పోటీ జరిగేది. కానీ ఈ వారం కొంచెం కొత్తగా ఎక్స్ హౌస్ మేట్స్ లోపలికి వచ్చి పోటీ ఇచ్చారు.

ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ కు అర్హులు కాకుండా తనుజ, సుమన్ శెట్టి, భరణి మిగిలిపోయారు. ఎక్స్ హౌస్ మేట్స్ తో వీళ్ళు ఆడి కూడా ఓడిపోవడం వలన వీళ్ళు కెప్టెన్సీకి ప్రస్తుతం అర్హులు కారు. ఈ కెప్టెన్సీ కోసం అర్హులు కాని వారి మధ్య ఒక పోటీ పెట్టారు. ఈ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్లు ఎవరిని కెప్టెన్ గా చూడాలి అనుకుంటున్నారో వాళ్ళని ఎంచుకునే అవకాశం ఇచ్చారు.

Advertisement

కెప్టెన్సీకి అర్హత లేని తనుజ, సుమన్, భరణి మధ్యలో జరిగిన గేమ్లో సుమన్ గెలిచి తను కెప్టెన్ గా చూడాలనుకుంటున్న రీతును ఎంచుకున్నాడు. ఈ తరుణంలోనే రీతుకి మరియు సంజనకి మధ్య ఆర్గ్యుమెంట్ మొదలైంది.

నీ గేమ్ ఏముంది రీతు? 

వీరిద్దరి మధ్య జరుగుతున్న హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో సంజనా మాట్లాడుతూ అసలు నీ గేమ్ ఏముంది రీతు పొద్దున్నే లేస్తావు నువ్వు ఒక మూలకి వెళ్ళిపోతావ్. పవన్ ఒక మూలకు వెళ్లిపోతాడు. మళ్లీ వస్తావ్ మీ ఇద్దరు ప్యాచ్అప్ అవుతారు అంటూ మరోసారి సంజన కామెంట్ చేసింది.

గొడవ జరిగే అవకాశం? 

Advertisement

అయితే వీరిద్దరికీ మధ్య ఏ రేంజ్ లో గొడవ జరిగిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ వారంలో నాగర్జున వచ్చి వీళ్లకు ఏం క్లాస్ పీకుతారు అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. ఈ తరుణంలో మరోమారు వీరిద్దరి మధ్య అదే టాపిక్ మీద ఆర్గ్యుమెంట్ నడిచింది.

మొత్తానికి వీళ్ళ మధ్య జరిగే గొడవ వలన పవన్ కి కూడా ఎఫెక్ట్ జరుగుతుంది. తనూజ దివ్య గొడవ మధ్యలోకి ఎలా అయితే భరణిని ఇన్వాల్వ్ చేస్తున్నారో రీతు మరియు సంజనా గొడవ మధ్య పాపం పవన్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. వీటన్నిటికీ నాగార్జున బ్రేక్ వేయాల్సిందే.

Also Read: Bigg Boss 9 Telugu : హౌస్ లో దొంగతనం, మధ్యలో దూరకంటూ దివ్యతో గొడవ పడిన భరణి

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×