E-Paper
Advertisement

ఆ బ్లాక్ బాస్టర్ సినిమాలో నా సీన్స్ కాపీ కొట్టారంటున్నయంగ్ డైరెక్టర్ !

ఆ బ్లాక్ బాస్టర్ సినిమాలో నా సీన్స్ కాపీ కొట్టారంటున్నయంగ్ డైరెక్టర్ !
Advertisement

O Sukumari: ఓ సుకుమారి సినిమా దర్శకుడు భరత్ దర్శన్ తనకు ఇండస్ట్రీలో ఎదురైనా అనుభవాలని ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు.ముఖ్యంగా తను ఎంతగానో అన్నా అని నమ్మిన ఒక వ్యక్తి తనకి ఎలా వెన్ను పోటు పొడిచాడో తెలిపాడు .సినిమా ట్రయల్స్ లో ఉన్నప్పుడు ఆ అన్నకి తన వద్ద ఉన్న కొన్ని కథలని చెప్పానని, అయితే ఆ వ్యక్తీ తన కథలలోని కొన్ని సీన్స్ ని రీసెంట్ గా సంక్రాతికి వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలో వాడేశారని, ఆ సినిమాకి అతని పేరు థాంక్స్ అంటూ టైటిల్ కార్డ్ లో వేయడం తో నాకా విషయం అర్థం అయిందని వాపోయాడు.

వన్ లైనర్స్ ఎత్తేసి తన సినిమాలో వాడుకున్న హీరో 

ఇక ఆ సినిమాలోని హీరోకే తను మరో బౌండెడ్ స్క్రిప్ట్ పంపించానని,యాదృచ్చికంగా ఆ సినిమా హీరో కూడా ఆ స్క్రిప్ట్ లోని వన్ లైనర్స్ ని ఎత్తేసి తన సినిమాలో వాడుకున్నాడని, దీనివల్ల తన ఓ సుకుమారి సినిమాకి చాలా ఇబ్బంది అయిందని మనసులోని బాధని ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు భరత్. ఇక నిర్మాతలని ఒప్పించుకొని మళ్ళీ తన స్క్రిప్ట్ ని రీరైట్ చేసుకున్నానని, ఎవరైనా తమకి పెద్ద హీరోలకి కథ చెప్పే అవకాశం వస్తే గంతులు వేయకుండా ముందు తమ వద్ద ఉన్న కథని రిజిస్టర్ చేయించుకోవడమో చేస్తే చాలా మంచిదని, లేక పొతే వాళ్ళు కూడా తన లాగే మోసపోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు ఈ యంగ్ డైరెక్టర్.

ఆ సినిమా అనగనగ ఒక రాజేనా ?

Advertisement

అయితే భరత్ చెప్పిన మాటలని బట్టి చూస్తే ఆ సినిమా మొన్నటి పొంగల్ కి వచ్చిన అనగనగ ఒక రాజు సినిమా అని, అందులో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎలక్షన్స్ జరిగే సీన్స్ మరియు ఆ సినిమాలో హీరోయిన్ ని లవ్ లో పడగొట్టేందుకు హీరో ఇంప్రెస్ చేయడం వంటివే భరత్ చెప్పిన సీన్స్ కావొచ్చని డిబేట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.మరి నిజానిజలేంటో అటు యంగ్ డైరెక్టర్ భరత్ కాని ,లేక హీరో నవీన్ పోలిశెట్టి అండ్ టీమ్ స్పందిస్తే కానీ తెలీదు.

జులై 17న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ‘ఓ సుకుమారి’ 

ఇక తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జోడీగా నటించిన ‘ఓ సుకుమారి’ తోనే ఇండస్ట్రీలో డెబ్యూ గా అడుగేస్తున్నాడు భరత్ దర్శన్. పొలిటీషియన్ కావాలనుకునే అబ్బాయి, సుకుమారి అనే అమ్మాయితో ప్రేమలో పడటం, ఆ తర్వాత అమ్మాయిని ఎవరు తాకినా షాక్ కొట్టడం వంటి వెరైటీ పాయింట్ తో తెరకెక్కింది ఈ సినిమా. ఇక గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ సినిమాని జులై 17న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ వేస్తున్నారు మేకర్స్. చూడాలి మరి ఫుల్ కాన్ఫిడెంట్ గా భరత్ ఈ సినిమాతో ఎలా లాంచ్ అవుతాడో !

Advertisement

also read:హాట్ పిక్స్ కావాలా? …ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌పై పాయల్ రాజ్‌పుత్ స్ట్రాంగ్ కౌంటర్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×