E-Paper
Advertisement

‘హనుమాన్ జయంతి’ రోజున చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే.. ఓ లుక్కేయండి..

‘హనుమాన్ జయంతి’ రోజున చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే.. ఓ లుక్కేయండి..
Advertisement

Hanuman Movies: హనుమాన్ జయంతి అంటేనే భక్తి పారవశ్యం, హనుమాన్ చాలీసా పారాయణం. ఈ విశేషమైన రోజున కుటుంబ సభ్యులతో కలిసి చూడదగ్గ కొన్ని అత్యుత్తమ తెలుగు చిత్రాలు ఇవే.

హను-మాన్ (2024)

ప్రస్తుత కాలంలో హనుమంతుడి శక్తిని ఆధునిక టెక్నాలజీతో జోడించి చూపిస్తే ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు సమాధానం ఈ చిత్రం. దర్శకుడు ప్రశాంత్ వర్మ సృష్టించిన ఈ ‘సూపర్ హీరో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, అంజనాద్రి అనే గ్రామంలో ఒక సామాన్యుడికి హనుమంతుడి శక్తులు లభిస్తే అతను దుష్టశక్తులను ఎలా ఎదుర్కొన్నాడు అనేది అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే హనుమంతుడి సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.

Advertisement

Read also-యుగానికి ఒక్కడు 2 ఉంటుందా? లేదా? క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా!

శ్రీ ఆంజనేయం (2004)

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఒక విజువల్ వండర్. హనుమంతుడిని ప్రాణంగా నమ్మే ఒక యువకుడికి (నితిన్), సాక్షాత్తు ఆ స్వామియే మానవ రూపంలో వచ్చి ఎలా సహాయం చేశాడనేది ఈ చిత్ర కథాంశం. అర్జున్ సర్జా హనుమంతుడిగా అద్భుతమైన నటన కనబరిచారు. ఈ సినిమాలో పాటలు, గ్రాఫిక్స్ మరియు హనుమంతుడి భక్తిని చాటే సన్నివేశాలు నేటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

బజరంగీ భాయ్‌జాన్

Advertisement

నేరుగా హనుమంతుడి కథ కాకపోయినా, స్వామివారి భక్తుడైన ఒక వ్యక్తి (సల్మాన్ ఖాన్) ఎంతటి నిబద్ధతతో, సత్యంతో ఉంటాడో ఈ సినిమాలో చూడవచ్చు. హనుమంతుడి ఆశీస్సులతో ఒక చిన్నారిని సరిహద్దు దాటించి తన ఇంటికి చేర్చే ఈ కథలో మానవత్వం, భక్తి మెండుగా ఉంటాయి. భజరంగబలిని నమ్మే ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఎమోషనల్ రైడ్ ఇది.

Read also-Ramayana Teaser Review: రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ టీజర్ ఎలా ఉందంటే?… ఫుల్ రివ్యూ..

మరిన్ని పౌరాణిక చిత్రాలు

పౌరాణిక సినిమాలంటే తెలుగు వారికి ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆర్ కాలం నాటి చిత్రాలే. ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ వంటి సినిమాలు హనుమంతుడి రామభక్తిని, స్వామివారి గొప్పతనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతాయి. ఇవి పాత చిత్రాలైనప్పటికీ, పండుగ రోజున ఇంట్లోని పెద్దవారితో కలిసి చూడటానికి ఎంతో బాగుంటాయి. రాబోయే సినిమాల గురించి మాట్లాడుకుంటే.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతుంది.. దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×