E-Paper
Advertisement

రెండో పెళ్లి తర్వాత సమంత ఫస్ట్ బర్త్ డే..బెస్ట్ బర్త్ డే అంటూ సామ్ పోస్ట్!

రెండో పెళ్లి తర్వాత సమంత ఫస్ట్ బర్త్ డే..బెస్ట్ బర్త్ డే అంటూ సామ్ పోస్ట్!
Advertisement

Samantha: సమంత పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడిప్పుడే ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలు వెబ్ సిరీస్ లకు కమిట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకవైపు నటిగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా కూడా సమంత (Samantha)సినిమాలను నిర్మిస్తున్నారు. మరోవైపు క్లాత్ బిజినెస్ పెర్ఫ్యూ మ్ బిజినెస్ లోకి కూడా ఈమె అడుగు పెట్టారు. ఇక త్వరలోనే సమంత మా ఇంటి బంగారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఘనంగా సామ్ పుట్టినరోజు వేడుకలు..

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే ఏప్రిల్ 28వ తేదీ సమంత తన 39వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇలా సమంత పుట్టినరోజు కావడంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది సెలబ్రెటీలు ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా సమంత అభిమానుల సమక్షంలో తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే.

అభిమానులతో బర్త్ డే సెలబ్రేషన్స్..

Advertisement

ఇటీవల కాలంలో సమంత ఇలా పబ్లిక్ మీటింగ్స్ కు చాలా దూరంగా ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఈమె తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో కలిసి అభిమానుల సమక్షంలోనే కేక్ కట్ చేస్తూ ఎంతో ఘనంగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా చాలా రోజుల తర్వాత సమంత అభిమానులతో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడంతో ఈమె ఇందుకు సంబంధించిన వీడియోని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ బెస్ట్ బర్త్ డే(Best Birthday) అంటూ రెడ్ హార్ట్ ఎమోజిని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Advertisement

సమంత గత కొంతకాలంగా తన వ్యక్తిగత విషయాల వల్ల పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉండటమే కాకుండా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న ఈమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు అనంతరం మయూసైటీస్ వ్యాధి కారణంగా చాలా సతమతమయ్యారు అయితే వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ఈమె కొత్త జీవితం ప్రారంభించారు డిసెంబర్లో సమంత దర్శకుడు రాజ్ (Raj Nidimoru)ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత సమంత ఫస్ట్ పుట్టినరోజు కావడంతో ఈ పుట్టినరోజు ప్రత్యేకంగా మారిందని చెప్పాలి. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత నందిని రెడ్డి డైరెక్షన్లో లేడి ఓరియంటెడ్ సినిమాగా నటించిన మా ఇంటి బంగారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా మే 15వ తేదీ విడుదలకు సిద్ధమైంది.

Also Read: నాకు బుర్రలేదు.. బ్లాక్ బస్టర్ సినిమా రిజెక్ట్ చేయడం పై ఫరియా షాకింగ్ కామెంట్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×