// // Bellamkonda Srinivas: కావ్య రెడ్డితో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి- Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్  ఏంటో తెలుసా?

Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్  ఏంటో తెలుసా?
Advertisement

Bellamkonda srinivas: టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలు అందరూ వరుసగా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ రష్మికల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఇక నేడు అల్లు శిరీష్ నైనిక రెడ్డిల వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఇలా టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటూ కొత్త బంధంలోకి అడుగు పెడుతున్నారు అయితే మరొక హీరో కూడా తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెబుతూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

కావ్య రెడ్డితో బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న బెల్లంకొండ సురేష్ కుమారుడిగా బెల్లంకొండ శ్రీనివాస్(Bellam konda srinivas)  హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ప్రస్తుతం ఈయన పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బెల్లంకొండ శ్రీనివాస తను ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు నడవబోతున్నారని సమాచారం. సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి (Kavya reddy)అనే అమ్మాయిని ప్రేమించారని పెద్దలను ఒప్పించి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నిశ్చితార్థానికి(Engagment) సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది.

మార్చి 8న నిశ్చితార్థం..

Advertisement

ఇండస్ట్రీ సమాచారం ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి ఇలా నిశ్చితార్థపు వేడుక మార్చి 8వ తేదీ ఎంతో ఘనంగా జరగబోతుందని తెలుస్తోంది. ఇక పెళ్లికూతురు కావ్య రెడ్డి విషయానికి వస్తే ఈమె స్వస్థలం హైదరాబాద్ కావటం విశేషం. కావ్య రెడ్డి ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి ఏమాత్రం కాదు. కావ్య రెడ్డి తాత జడ్జి కాగా ఆమె తండ్రి లాయర్ అని తెలుస్తుంది. వీరి కుటుంబం సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేదని, వీరిద్దరూ పెద్దల సమక్షంలోనే ప్రేమ వివాహం జరుపుకోబోతున్నారని తెలుస్తోంది.

కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం..

Advertisement

ఇక శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి కావ్య ఏం జాబ్ చేస్తారు? అనే వివరాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. ఇకపోతే బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఆయన కానీ తన టీం కానీ ఈ విషయంపై ఎక్కడా స్పందిస్తూ అధికారకంగా వెల్లడించలేదు ఈయన రహస్యంగా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ నిశ్చితార్థం  జరుపుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో అభిమానులు ముందుగానే ఈయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Also Read: Vijay Thalapathy -Trisha: విజయ్ త్రిష రిలేషన్ రూమర్స్.. సంచలనంగా మారిన విజయ్ బాడీ గార్డ్ పోస్ట్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×