E-Paper
Advertisement

సాంప్రదాయ పద్ధతిలో బెల్లంకొండ శ్రీనివాస్ హల్దీ వేడుక..వీడియో వైరల్!

సాంప్రదాయ పద్ధతిలో బెల్లంకొండ శ్రీనివాస్ హల్దీ వేడుక..వీడియో వైరల్!
Advertisement

Bellamkonda srinivas: మరికొన్ని గంటలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. నేడు సాయంత్రం 11 గంటలకు తిరుపతిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellam Konda Srinivas) కావ్యరెడ్డి(Kavya Reddy)ల వివాహం ఎంతో ఘనంగా జరగబోతోంది. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. గత కొద్దిరోజులుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి వేడుకకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈయన హల్దీ వేడుకకు (Haldi Ceremony)సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి కొడుకు వేడుకను నిర్వహించారు.

తిరుపతి చేరుకున్న సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి..

ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక నేడు సాయంత్రం వీరి వివాహకు వేడుక తిరుపతిలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతోంది. ఈ పెళ్లి వేడుకకు సుమారు 500 మంది వరకు అతిథులు హాజరు కాబోతున్నారని సమాచారం. ఇక నేడు సాయంత్రం 11 గంటలకు శ్రీనివాస్ కావ్యరెడ్డిల వివాహం జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులు తిరుపతికి చేరుకున్నారు. నేడు తిరుపతిలో వీరి వివాహం జరగగా, మే 1వ తేదీ హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్ జరగబోతోంది.

హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్..

Advertisement

ఈ వివాహ రిసెప్షన్ వేడుకలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ కుటుంబ సభ్యులు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు మంత్రులను కూడా ఆహ్వానించారు అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క సెలబ్రిటీని కూడా స్వయంగా బెల్లంకొండ కుటుంబం మొత్తం వెళ్లి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే పాల్గొనగా రిసెప్షన్  మాత్రం ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు మొత్తం హాజరు కాబోతున్నారు.

?igsh=MWMyZGlkN3p3ZHNlZA%3D%3D

Advertisement

ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేమ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే .ఈయన గత కొన్ని సంవత్సరాలుగా కావ్య రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నారు. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకోబోతున్నారు. ఏప్రిల్ 5వ తేదీ ఈ జంట హైదరాబాద్లోనే ఫామ్ హౌస్ లో సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్ గా నిశ్చితార్థం జరుపుకున్నారు. నిశ్చితార్థం అయిన 20 రోజులకే ఈ జంట తిరుపతిలో పెళ్లి చేసుకోవడం విశేషం. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల తిరిగి ఇండస్ట్రీలో ఎంతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు మంచి మంచి సక్సెస్ అందుకున్న సాయి శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు అనే సినిమా పనులకు బిజీగా ఉన్నారు.

Also Read: శ్రీనివాస మంగాపురం నుంచి ‘అలేల్లే .. అలేల్లే’ ఫస్ట్ సింగిల్ రిలీజ్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×