E-Paper
Advertisement

Bandla Ganesh: సుజిత్ కు కారు ఇచ్చిన పవన్… బండ్లన్న షాకింగ్ కామెంట్స్!

Bandla Ganesh: సుజిత్ కు కారు ఇచ్చిన పవన్… బండ్లన్న షాకింగ్ కామెంట్స్!
Advertisement

Bandla Ganesh: బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కమెడియన్ గా కొనసాగిన బండ్ల గణేష్ అనంతరం నిర్మాతగా మారి స్టార్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ అందుకొని స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ కొట్టిన బండ్ల గణేష్ (Bandla Ganesh)ఇటీవల కాలంలో పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే త్వరలోనే తన రీ ఎంట్రీ ఉండబోతుందని చెప్పిన బండ్ల గణేష్ ఇప్పటివరకు తన కొత్త సినిమాని మాత్రం ప్రకటించలేదు. ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈయన నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాల గురించి అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.

నాకు జీవితమే ఇచ్చారు..

తాజాగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇటీవల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దర్శకుడు సుజిత్(Sujeeth) కు ఖరీదైన కారును కానుకగా అందించిన సంగతి తెలిసిందే. సుమారు కోటి రూపాయల విలువచేసే ఈ కారును పవన్ కళ్యాణ్ సుజిత్ కు కానుకగా అందించడంతో అభిమానులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ సుజిత్ కారుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ..” కంగ్రాట్యులేషన్స్.. మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు” అంటూ పోస్ట్ చేశారు.

పవన్ కళ్యాణ్ పై విపరీతమైన అభిమానం..

Advertisement

ఇలా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కారును గిఫ్ట్ గా ఇవ్వడం గురించి స్పందిస్తూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కు ఎంత అభిమానం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ ను ఏకంగా దేవుడిగా భావించి పూజిస్తుంటారు. ఏదైనా వేదిక ఎక్కితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పరమేశ్వర అని సంబోధిస్తూ ఉంటారు. ఇలా పవన్ కళ్యాణ్ తో చాలా సన్నిహితంగా ఉన్న బండ్ల గణేష్ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ను కలిసిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి.

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలో సక్సెస్ అయినప్పటికీ బండ్ల గణేష్ ఎక్కడ ఆయనని కలిసి అభినందనలు తెలియచేయలేదు. పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ దూరం కావడానికి కొంతమంది ప్రమేయం ఉందని కొందరు ఉద్దేశపూర్వకంగానే తనని దూరం చేశారు అంటూ పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై బండ్ల గణేష్ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక తాజాగా పవన్ ఇచ్చిన గిఫ్ట్ గురించి ఈయన కామెంట్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కు ఈ ఖరీదైన కారును కానుకగా అందజేశారు.

Also Read: NBK 111: బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమాకు ఆసక్తికర టైటిల్..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×