E-Paper
Advertisement

Bandla Ganesh : ఆ ఇంస్టాగ్రామ్ అకౌంట్ నాది కాదు, క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

Bandla Ganesh : ఆ ఇంస్టాగ్రామ్ అకౌంట్ నాది కాదు, క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్
Advertisement

Bandla Ganesh : ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సాధించుకున్నాడు బండ్ల గణేష్. నటుడుగా కెరియర్ మొదలు పెట్టాను బండ్ల గణేష్ తర్వాత కాలంలో ప్రొడ్యూసర్ అయిపోయారు. సుస్వాగతం సినిమా జరుగుతున్న టైంలో, ప్రొడ్యూసర్ అవ్వాలి అని ఉంది అని గణేష్ పవన్ కళ్యాణ్ తో చెప్పారట. నేను నిన్ను ప్రొడ్యూసర్ ను చేస్తాను అని పవన్ కళ్యాణ్ అన్నారట. అయితే పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నారో లేదో పక్కన పెడితే బండ్ల గణేష్ ఈ మాటలు చెబుతూ ఉంటారు.

మొత్తానికి బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా మారిపోయారు. అతను తీసిన తీన్మార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా మంచి సక్సెస్ సాధించింది. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేయడం మొదలుపెట్టాడు బండ్ల గణేష్. ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాలు చేశాడు. ఇక ప్రస్తుతం బండ్ల గణేష్ సినిమాలు చేయడం మానేశారు.

ఇంస్టాగ్రామ్ అకౌంట్ పై క్లారిటీ 

Advertisement

బండ్ల గణేష్ నిర్మాతగా సినిమాలు చేయకపోయినా కూడా చాలా ఫంక్షన్స్ కి చీఫ్ గెస్ట్ గా హాజరవుతారు. అలా హాజరవడం మాత్రమే కాకుండా తను చేసిన కొన్ని కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. అల్లు అరవింద్ గురించి మాట్లాడిన మాటలు కూడా బాగా పాపులర్ అయిపోయాయి.

కొన్నిసార్లు ట్విటర్లో కూడా కొన్ని అర్థం కాని లైన్స్ రాస్తూ ఉంటారు బండ్ల. కూడా ఎవర్నో టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంటాయి. ఇక తాజాగా తన instagram అకౌంట్ గురించి బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. Instagram అకౌంట్ నాది కాదు నా పేరు మీద ఎవరు దాన్ని రన్ చేస్తున్నారు. త్వరలో నేను ఇంస్టాగ్రామ్ లోకి ఎంటర్ అవుతాను అప్పుడు దానిని అధికారికంగా ప్రకటిస్తాను అని ట్విట్టర్లో స్క్రీన్ షాట్ షేర్ చేసి మరి ప్రకటించారు.

ప్రొడ్యూసర్ గా కం బ్యాక్ ఇస్తారా?

Advertisement

బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా సినిమాలు చేయాలి అని చాలామంది అనుకుంటున్నారు. మరోవైపు ప్రొడ్యూసర్ గా కూడా తన జర్నీ మొదలు పెడతారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. రీసెంట్ గా జరిగిన ఒక ఫంక్షన్ లో నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడుతూ మేధావి మౌనం అనేది దేశానికి ప్రమాదకరం. మీరు సినిమాలు నిర్మించకపోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ప్రమాదకరం అంటూ చెప్పాడు.

అయితే విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేద్దాం అనుకున్నారట బండ్ల. అతను డేట్ ఇవ్వని కారణంగానే అతనిపైన కామెంట్స్ కూడా చేశారు అని వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. మరోవైపు కిరణ్ అబ్బవరం హీరోగా బండ్ల గణేష్ సినిమా చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారికి డీటెయిల్స్ ఏవి బయటకు రాలేదు.

Also Read: Champion first song : రోషన్ మేక ఛాంపియన్ సాంగ్ వచ్చేసింది, ఎలా ఉంది అంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×