E-Paper
Advertisement

Balakrishna: అఖండ 2 నష్టాల విషయంలో బయర్లతోపాటు.. అతని కలవనున్న బోయపాటి..!

Balakrishna: అఖండ 2 నష్టాల విషయంలో బయర్లతోపాటు.. అతని కలవనున్న బోయపాటి..!
Advertisement

Akhanda 2 Loss: నందమూరి బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానుల్లో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. అలాంటి బాలయ్య కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచిన అఖండ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సినిమా అఖండ 2: తాండవం. ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. బోయపాటి శ్రీను బాలకృష్ణ వంటి క్రేజీ కాంబినేషన్ కాబట్టి కలెక్షన్స్ కి ఆకాశమే హద్దు అనుకున్నారు అందరూ. అందుకే ఈ సినిమాను చాలా భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశారు.

దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా, డిసెంబర్ 12, 2025న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయింది. మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. బాలయ్య అభిమానులు థియేటర్లకు పరుగులు తీశారు. అయితే సినిమా చూసిన తర్వాత టాక్ మాత్రం మెల్లగా డౌన్ అయ్యింది. కథలో కొత్తదనం లేదని, మొదటి భాగంతో పోలిస్తే ఎమోషన్ మిస్ అయిందని, యాక్షన్ ఎక్కువగా ఉన్నా కనెక్ట్ కావడం కష్టమని ప్రేక్షకులు చెప్పడం మొదలుపెట్టారు.

Advertisement

ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా హక్కులు కొనుగోలు చేసిన బయ్యర్లు దాదాపు 50 శాతం వరకు నష్టం ఎదుర్కొన్నారనే సమాచారం బయటకు వచ్చింది. దీంతో వాళ్లు డైరెక్టర్ బోయపాటి శ్రీనుని కలిసి తమ సమస్యలను వివరించారు.

బయ్యర్లు చెప్పినదాని ప్రకారం.. సినిమా రిలీజ్‌కు ముందు ప్రొడ్యూసర్స్ జనవరిలో GST అమౌంట్ చెల్లిస్తామని హామీ ఇచ్చారట. కానీ అది పూర్తిగా అమలు కాలేదని..రికవరీ కూడా చాలా తక్కువగా జరిగిందని వారు వాపోయారు.

Advertisement

ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. సినిమా రిలీజ్ సమయంలో మాంగో రామ్ కీలకంగా వ్యవహరించారని, ఫైనాన్షియల్ డీటైల్స్ అన్నీ ఆయనకి పూర్తిగా తెలుస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అందుకే ఆయనను కలవమని బోయపాటి బయ్యర్లను చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే బయ్యర్లు, బోయపాటి అసోసియేట్స్ కలిసి మాంగో రామ్‌ను కలిసే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ మీటింగ్ తర్వాత అయినా బయ్యర్ల నష్టాలకు ఏమైనా పరిష్కారం దొరుకుతుందో లేదో ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. మొత్తానికి అఖండ 2: తాండవం సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. బాలయ్యకి మంచి మార్కెట్ ఉన్నా, భారీ బడ్జెట్ సినిమా అయినా కంటెంట్ కూడా అంతే ముఖ్యమని మరోసారి ఈ సినిమా నిరూపించింది. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు సంగీతం అందించింది థమన్. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మించారు.

ALSO READ: Akhanda2: అఖండ2 పై హైకోర్టు ఆదేశాలు పాటించండి.. హోంశాఖ ఉత్తర్వులు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×