E-Paper
Advertisement

NBK 111 Update : బాలయ్య మూవీ నుంచి నయనతార అవుట్… మధ్యలోనే గుడ్ బై చెప్పిన మేకర్స్

NBK 111 Update : బాలయ్య మూవీ నుంచి నయనతార అవుట్… మధ్యలోనే గుడ్ బై చెప్పిన మేకర్స్
Advertisement

Nayanthara and Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ అంటే తెలుగు సినీ అభిమానులకు ఒక ఎమోషన్. కానీ తాజాగా వచ్చిన అఖండ 2: తాండవం విషయంలో మాత్రం ఆ స్థాయి హడావుడి బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా కనిపించలేదన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. డిసెంబర్ 12, 2025న భారీ అంచనాలతో విడుదలైన అఖండ 2కి మొదటి కొన్ని రోజులు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. సింగిల్ స్క్రీన్‌లలో హౌస్‌ఫుల్స్ కూడా నమోదయ్యాయి. కానీ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువగా ఉండటం, మార్కెట్ అంచనాలు భారీగా పెట్టుకోవడం వల్ల అసలు సమస్య మొదలైంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో ఆ ప్రభావం ఈ సినిమా ఫైనల్ రిజల్ట్‌ మీద పడింది.

అఖండ ఎఫెక్ట్ మామూలుగా లేదు..

Advertisement

ఇలాంటి పరిస్థితుల్లోనే బాలకృష్ణ తన తదుపరి సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అదే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే NBK 111. ఇది బాలయ్య కెరీర్‌లో 111వ సినిమా కావడం వల్ల అభిమానుల్లో ముందే ఒక స్పెషల్ బజ్ ఉంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వీర సింహారెడ్డి (2023) మంచి కమర్షియల్ సక్సెస్ కావడంతో, ఈసారి కూడా ఈ జోడీపై అంచనాలు బాగానే ఉన్నాయి.

బాలకృష్ణ బడ్జెట్ కి భారీ కట్..

Advertisement

NBK 111ని మొదట భారీ బడ్జెట్‌తో, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాగా ప్లాన్ చేశారన్న టాక్ వచ్చింది. భారీ సెట్లు, పెద్ద యుద్ధ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్ ఉంటాయనే ప్రచారం కూడా జరిగింది. కానీ అఖండ 2 ఫలితాల తర్వాత మేకర్స్ ఒక్కసారిగా ఆలోచన మార్చుకున్నారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద హీరో సినిమాలు OTT డీల్స్ విషయంలో ఇబ్బందులు పడుతున్నాయి. ఒకప్పుడు డిజిటల్ రైట్స్‌కే భారీ రేట్లు వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే ప్రొడ్యూసర్లు ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో NBK 111ని పరిమితమైన బడ్జెట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట.

NBK111 సినిమాకి దాదాపు ₹170 కోట్ల బడ్జెట్ వరకు ఖర్చు పెట్టాలనే ఆలోచన ఉందట. కానీ ప్రస్తుతం పరిస్థితుల కారణంగానే మేకర్స్ NBK111 కథను మార్చి, అనవసరమైన ఖర్చులు తగ్గించి, పూర్తిగా బాలయ్య స్టైల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారట. అంటే కథ కంటే కూడా బాలకృష్ణ మార్క్ డైలాగ్స్, పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్, ఎమోషన్, మాస్ ఎలివేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నారన్న మాట. గోపీచంద్ మలినేని కూడా మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు కావడంతో, ఈసారి భారీ బడ్జెట్ సినిమా కన్నా ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే హీరోయిన్ విషయంలో కూడా మార్పు జరుగుతుందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. మొదట ఈ సినిమాలో నయనతారను తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె ఒక్క సినిమాకే సుమారు ₹11 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు బడ్జెట్ తగ్గించాలనే ఉద్దేశంతో, మేకర్స్ మరో హీరోయిన్‌ను చూసే ఆలోచనలో ఉన్నారట. దీంతో ఏకంగా నయన్ విషయంలోనే ఫిట్టింగ్ పెట్టేశారా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ: MSVPG Film: మన శంకర్ వరప్రసాద్ గారు సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×