E-Paper
Advertisement

Balakrishna: బాలయ్య అఖండ 2 మాత్రమే కాదు.. గతంలోనూ ఈ సినిమాలు ఆగిపోయాయని తెలుసా?

Balakrishna: బాలయ్య అఖండ 2 మాత్రమే కాదు.. గతంలోనూ ఈ సినిమాలు ఆగిపోయాయని తెలుసా?
Advertisement

Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం అఖండ 2(Akhanda 2). బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. అయితే ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిందని, మరి కాసేపట్లో ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సినిమా చివరి నిమిషంలో వాయిదా పడటంతో బాలయ్య అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2 రోజులు వాయిదా పడిన మహారధి..

ఒక స్టార్ హీరో సినిమాకి ఏదైనా సమస్యలు ఉంటే అన్నింటిని నిర్మాతలు ముందుగానే చూసుకోవాలి ఇలా చివరి నిమిషంలో వాయిదా వేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.. అయితే బాలయ్య సినీ కెరియర్లో కేవలం అఖండ 2 మాత్రమే కాదు గతంలో కూడా రెండు సినిమాలు ఇలా విడుదల తేదీ నుంచి రెండు రోజులు వాయిదా పడినట్లు తెలుస్తోంది.బాలకృష్ణ మీరాజాస్మిన్, స్నేహ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా 2007వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు వాయిదా పడి అనంతరం రెండు రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

పల్నాటి బ్రహ్మనాయుడు..

Advertisement

ఇలా మహారధి సినిమా మాత్రమే కాకుండా ఈ సినిమా కంటే ముందుగానే బాలకృష్ణ నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా కూడా విడుదలకు ముందు వాయిదా పడి అనంతరం రెండు రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా 2003 జూన్ 13 వ తేదీ విడుదలైంది. బి గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇలా గతంలో ఈ రెండు సినిమాలు విడుదలకు ముందు వాయిదా పడ్డాయి. ఈ రెండు సినిమాల తర్వాత ఇప్పుడు అఖండ 2 వారం రోజులు వాయిదా పడిందని తెలుస్తోంది.

చిన్న సినిమాలపై అఖండ 2 ప్రభావం..

Advertisement

అఖండ 2 సినిమాకి తలెత్తిన ఫైనాన్స్ ఇబ్బందులని క్లియర్ అయిన నేపథ్యంలో డిసెంబర్ 12వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో 11వ తేదీ ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయని తెలుస్తుంది. డిసెంబర్ 12వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అదే రోజు విడుదలవుతున్న సినిమాల విషయంలో సందిగ్ధత నెలకొంది. డిసెంబర్ 12వ తేదీ రోషన్ మోగ్లీ, అన్నగారు వస్తారు, ఈషా, సైక్ సిద్ధార్థ్ వంటి సినిమాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మరి అఖండ 2 కూడా అదే రోజు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఏ ఏ సినిమాలు వెనక్కి వెళ్తాయో తెలియాల్సి ఉంది.

Also Read: Nayanam Trailer: కళ్ళు కదా చాలా ఇంపార్టెంట్.. ఆకట్టుకుంటున్న నయనం ట్రైలర్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×