E-Paper
Advertisement

Akhanda 2: నిన్ను ఎవడు రమ్మన్నాడు… ఫ్యాన్స్‌పై మళ్లీ రెచ్చిపోయిన బాలయ్య

Akhanda 2: నిన్ను ఎవడు రమ్మన్నాడు… ఫ్యాన్స్‌పై మళ్లీ రెచ్చిపోయిన బాలయ్య
Advertisement

Akhanda 2: బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ 2. గతంలో వచ్చిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమా మీద ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ముంబై వేదికగా విడుదల చేశారు. ఆ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఈ సినిమా సెకండ్ సింగిల్ వైజాగ్ వేదికగా విడుదల చేయడానికి ముందు నుంచే ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు సెకండ్ సింగిల్ విడుదల కానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ అంతా వైజాగ్ చేరింది.

Advertisement

వైజాగ్ ఎయిర్పోర్టులో దిగగానే బాలయ్యను చాలా మంది అభిమానులు వచ్చి ఆహ్వానం పలికారు. కొంతమంది బాలయ్య తో ఫోటోలు కూడా దిగారు. దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆవేశంతో రెచ్చిపోయిన బాలయ్య

అయితే బాలయ్య కు ఏం జరిగిందో తెలియదు. కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఆవేశంతో రెచ్చిపోయారు. అందులో ఒక అభిమానిని ఉద్దేశిస్తూ వీడెందుకు వచ్చాడు, వెళ్ళగొట్టండి. సాయంత్రం కూడా వీడు కనపడకూడదని రెచ్చిపోయారు బాలకృష్ణ.

Advertisement

అక్కడితో వదలకుండా కారు ఎక్కుతున్న టైంలో కూడా మరీ మరీ వీడు కనిపించకూడదు అంటూ మాట్లాడారు. అయితే బాలయ్య అలా మాట్లాడడానికి కారణం ఏమై ఉంటుందా అనేది ఎవరికి తెలియని విషయం. ఖచ్చితంగా దీని గురించి కొంతమంది బాలకృష్ణ అభిమానులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు.

అభిమాని క్లారిటీ ఇస్తాడా? 

బాలకృష్ణ అభిమానులకి విపరీతమైన ప్రేమ ఉంటుంది. గతంలో ఒక వ్యక్తిని బాలకృష్ణ పుట్టినప్పుడు కొన్ని రోజులు తర్వాత ఆ వ్యక్తి వీడియో పెడుతూ, బాలకృష్ణ గారు నన్ను ముట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన కాళ్లను ఎవరో తొక్కారు అందువల్లనే ఆయన అసహనంతో నన్ను కొట్టారు అంటూ బాలకృష్ణను సమర్థించే ప్రయత్నం చేశాడు.

ఇప్పుడు కూడా ఈ అభిమాని ఎందుకు బాలకృష్ణ తనను అక్కడ కనిపించవద్దని చెప్పారు అనే వీడియో క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. అఖండ టు సింగల్ పైన సర్వత్ర ఆసక్తి నెలకొంది. తమన్ ఈ సాంగ్ ఎలా డిజైన్ చేశాడో చూడాలి.

Also Read: Allari Naresh : డైరెక్టర్ కు సారీ చెప్పిన అల్లరి నరేష్, నా వలన తిట్లు కాస్తున్నాడు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×