E-Paper
Advertisement

Akhanda 2 Juke Box: Akhanda 2 Juke Box: అఖండ 2 ఒక్కో పాటకు ఒక్కో స్పెషల్.. మూవీలో మొత్తం ఎన్ని సాంగ్స్ అంటే?

Akhanda 2 Juke Box: Akhanda 2 Juke Box: అఖండ 2 ఒక్కో పాటకు ఒక్కో స్పెషల్.. మూవీలో మొత్తం ఎన్ని సాంగ్స్ అంటే?
Advertisement

Akhanda 2 Juke Box: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna)హీరోగా బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం అఖండ 2(Akhanda 2). ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన పాటలు కానీ టీజర్ ట్రైలర్ వంటి అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా విజయం పై అభిమానులతో పాటు చిత్ర బృందం కూడా ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అఖండ 2 జ్యూక్ బాక్స్…

ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం సినిమా నుంచి మరొక అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి జ్యూక్ బాక్స్(Juke Box) ను విడుదల చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అఖండ 2 సినిమాలో మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి ఏంటి అనే విషయానికి వస్తే.. అఖండ 2 లో 9 పాటలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఒక్కో పాట ఒక్కో ప్రత్యేకతను సంతరించుకొని ఉండటం విశేషం. మరి అక్కడ 2 సినిమాలోని పాటలు ఏవీ అనే విషయానికి వస్తే..

Advertisement

1: అఖండ తాండవం: అఖండ తాండవం అంటూ సాగిపోయే ఈ టైటిల్ సాంగ్ ప్రతిరోజు ఉదయం సుప్రభాతంతో పాటు వినిపించాలనే అంత అద్భుతంగా అఖండ తాండవం పాటను తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఇక ఈ పాటను సర్వేపల్లి సిస్టర్స్ ఆలపించిన సంగతి తెలిసిందే.

2: గంగాధర శంకర: గంగాధర శంకర అంటూ సాగిపోయే ఈ పాట అద్భుతమైన సాహిత్యంతో కూడుకున్నది ఈ పాట వింటుంటే తెలియని ట్రాన్స్ లోకి మనల్ని తీసుకెళ్తుందని చెప్పాలి. ఈ పాటను ఐశ్వర్య, సౌందర్య, స్మృతి రంజిని అనే సింగర్లు ఆలపించగా, అద్వితీయ వోజ్జల సాహిత్యం అందించారు .

Advertisement

3: శివ శివ: కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యంలో ఫోక్ సింగర్ కనకవ్వ స్మృతి రంజని ఆలపించిన ఈ పాట అమ్మ బంధంతో ఎంతో అద్భుతంగా ముడిపెట్టి వర్ణించిన విధానం అద్భుతంగా ఉందని చెప్పాలి.

4: హర హర : హర హర శంకర అంటూ సాగిపోయే ఈ పాట వినడానికి సాధారణంగా ఉన్నప్పటికీ ఈ పాటలో వినిపించే స్వరం మాత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక ఈ పాటను ఎస్పీ చరణ్ శ్రీకృష్ణ ఆలపించగా కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు.

5: శంకర శంకర: కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించిన ఈ పాటను మహాలింగం, దివ్య కుమార్ దీపక్ బ్లూ అరుణ్ ఎంతో అద్భుతంగా ఆలపించారు.

6: శంభో: శంభో అంటూ సాగిపోయే ఈ పాట కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

7: అఖండ హైందవం: అఖండ హైందవం అంటూ సాగిపోయే ఈ పాటను సర్వేపల్లి సిస్టర్స్ ఎంతో అద్భుతంగా ఆలపించారు.

8: తాండవం: తాండవం అని పాటను కళ్ళు మూసుకుని వింటుంటే గూస్ బంప్స్ రావడం విశేషం అంత అద్భుతంగా ఈ పాట ఉండబోతుందని తెలుస్తుంది.

9: జాజికాయ: ఇటీవల విడుదల చేసిన జాజికాయ అనే పాట కూడా విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంటుంది. అయితే ఇది స్పెషల్ సాంగ్ కాదని చెప్పాలి. ఇలా ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో ఎంతో అద్భుతమైన పాటలు అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ జ్యూక్ బాక్స్ విడుదలైందే ఆలస్యం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Sujeeth – Nani: సుజిత్ నాని సినిమా బ్లడీ రొమియో కాదా..టైటిల్ ఎంటో తెలుసా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×