E-Paper
Advertisement

Tollywood : శేఖర్, జానీ మాస్టర్ లకు బ్యాడ్ టైం.. స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ ఆయనే..?

Tollywood : శేఖర్, జానీ మాస్టర్ లకు బ్యాడ్ టైం.. స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ ఆయనే..?
Advertisement

Tollywood : సినీ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఉన్నవాళ్ళకి మాత్రమే మంచి గుర్తింపు ఉంటుంది.. సినీ ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టమే.. అదృష్టం ఉన్న వాళ్ళు మొదటి సినిమాతోనే సక్సెస్ అయితే.. కొంతమంది మాత్రం ఎన్ని సినిమాలు చేసినా కూడా.. పాజిటివ్ టాక్ వస్తుంది కానీ స్టార్డం మాత్రం రావడం లేదు.. ఇండస్ట్రీలో నిలదొక్కుకొని సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. టాప్ పొజిషన్ కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ వరుస సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. కేవలం స్టార్ హీరోలకు స్టార్ హీరోయిన్లకు మాత్రమే కాదు.. సెలబ్రిటీలకు స్టెప్పులు నేర్పించే కొరియోగ్రాఫర్లకు పరిస్థితి కూడా అంతే.. వాళ్లు కంపోస్ట్ చేసే స్టెప్పులు ప్రేక్షకులకు నచ్చితే మాత్రం ఆ పాటని బాగా ట్రెండ్ చేస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ కొరియోగ్రాఫర్లు మంచి సక్సెస్ రేట్ ని సొంతం చేసుకున్నారు. గత ఏడాది వరకు ట్రెండింగ్ లో ఉన్న మాస్టర్స్ కు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది. ఇప్పుడు టాప్ లో ఉన్న కొరియోగ్రాఫర్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం..

జానీ, శేఖర్ లను పక్కకు నెట్టేసిన మరో మాస్టర్..

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలో సినిమాల్లోని పాటలు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చెప్పనక్కర్లేదు. వినడానికి మాత్రమే కాదు చూడడానికి కూడా బాగుంటాయి. అదిరిపోయే స్టెప్పులతో థియేటర్లను దద్దరిలేలా చేసేది కేవలం కొరియోగ్రాఫర్లు మాత్రమే. హీరోల చేత వాళ్ళు వేయించే స్టెప్పులు సినిమాకు హైలెట్ అవుతుంటాయి. మొన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లు అంటే ముఖ్యంగా వినిపించే పేర్లు శేఖర్ మాస్టర్ అలాగే జానీ మాస్టర్.. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి వీళ్ళు మాస్టర్లుగా పని చేశారు. అంతేకాదు ఈ మాస్టర్లు కొరియోగ్రఫీ చేసిన పాటలు జనాలను బాగా అలరించాయి. అయితే ఈ మధ్య ఈ మాస్టర్ల పేర్లు పెద్దగా వినిపించలేదు. ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలు అన్నిటికీ భాను మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. సీనియర్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరికీ ఆయన స్టెప్పులు నేర్పిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్లలో ఇతని పేరే మొదటిగా వినిపిస్తుంది.

Advertisement

Also Read :జపాన్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాలు ఇవే.. పుష్ప2 కలెక్షన్స్..?

భాను మాస్టర్ కంపోజ్ చేసిన పాటలు..

ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలకు కొరియోగ్రఫీ చేస్తూనే స్టార్ హీరోలకు సైతం తన స్టెప్పులను వేయిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్యకాలంలో ఆయనకు చాలా మంచి పాపులారిటి అయితే దక్కింది.. భాను మాస్టర్ కొరియోగ్రఫీలో స్టెప్స్ కంటే కూడా థిమ్ ను ఎలివేట్ చేస్తూ ఉంటాయి. కొత్తదనం కోరుకునే మూవీ లవర్స్ ఈ పాటలకి బాగా కనెక్ట్ అవుతున్నారు. రీసెంట్ గా చిరంజీవి హీరోగా వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో ‘యురేకా నువ్వు కేక’ సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాడు.. ఆ పాటలు చిరంజీవి వేసిన స్టెప్పులన్నీ కూడా జనాలకు బాగా నచ్చాయి. సోషల్ మీడియాలో ఆ పాట స్టెప్పులు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇదే స్పీడులో కనుక భాను మాస్టర్ సినిమాలు చేస్తే అతి త్వరలోనే టాప్ ప్లేస్ లోకి రావడం ఖాయం అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలు సైతం భాను మాస్టర్ తో స్టెప్పులేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ఏ హీరోతో భాను మాస్టర్ స్టెప్పులు వేయిస్తాడో చూడాలి..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×