// // Sirai Movie - ఆడియన్స్‌ని ఏడిపిస్తున్న విక్రమ్‌ ప్రభు 'సిరై'.. -->
E-Paper
Advertisement

Sirai Movie: థియేటర్లో ఆడియన్స్‌ని ఏడిపిస్తున్న విక్రమ్‌ ప్రభు ‘సిరై’.. వీడియోలు వైరల్‌

Sirai Movie: థియేటర్లో ఆడియన్స్‌ని ఏడిపిస్తున్న విక్రమ్‌ ప్రభు ‘సిరై’.. వీడియోలు వైరల్‌
Advertisement

Sirai Movie: ఈ మధ్య కాలంలో కంటెంట్‌ ఉన్న చిత్రాలు విపరీతమైన ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ చిత్రాలకు ఊహించని ఆదరణ దగ్గుతుంది. ఇక ఆడియన్స్‌ కూడా చిన్న సినిమా.. పెద్ద సినిమా అని చూడకుండ.. కంటెంట్‌ ఉన్న చిత్రాలకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో సినిమాని తెరకెక్కించడంలో దర్శకుడి కోణం కూడా మారుతుంది. ఆడియన్స్‌ని ద్రష్టిలో పెట్టుకుని కథ రాసుకుంటున్నారు. ఇంకా కొంతమంది దర్శకులైతే తానే ఓ ఆడియన్‌లా మూవీ తెరకెక్కిస్తున్నాడు.

అప్పుడు బలగం.. ఇప్పుడు సిరై

Advertisement

అలా తెలుగులో వచ్చిన బలగం మూవీ ఆడియన్స్‌కి ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ సంస్క్రతి నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి ప్రతి ఒక్కరు కనెక్ట్‌ అయ్యారు. థియేటర్లలోనే సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న సందర్భాలు చూశాం. ఇటీవల బాలీవుడ్‌లో వచ్చిన సైయారా మూవీకి కూడా ఆడియన్స్‌ మనసులను తాకింది. యూత్‌క బాగా కనెక్ట్‌ అయిన ఈ చిత్రం ఆడియన్స్‌ చేత కన్నీరు కూడా పెట్టింది. థియేటర్లలో ఈ సినిమా చూస్తు ఎంతోమంది ఏడ్చిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Also Read: Karate Kalyani Vs Anasuya: విచ్చలవిడిగా బట్టలేసుకోమని కూడా రాజ్యాంగం చెప్పలేదు.. అనసూయకి కరాటే కళ్యాన్‌ ఘాటు రిప్లై

Advertisement

ఏడిపించేసిన సిరై

అయితే తాజాగా వచ్చిన చిత్రం కూడా ఆడియన్స్‌ చేత కన్నీరు పెట్టిస్తుంది. అదే తమిళ్‌ చిత్రం సిరై. కోలీవుడ్‌ టాలెంటెడ్‌ యాక్టర్‌ విక్రమ్‌ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేడు థియేటర్లలోకి వచ్చింది. కేవలం తమిళ్‌భాషలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. ఈ మూవీ చూసేందుకు ఆడియన్స్ థియేటర్లలోకి క్యూ కడుతున్నారు. పోలీసు దర్యాప్తు నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఎమోషనల్‌గా కదిలిస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. ఈ క్రమంలో ఆడియన్స్‌ సినిమా చూస్తూ ఏడ్చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నేడు థియేటర్లలోకి

నేడు డిసెంబర్ 25వ క్రిస్మస్‌ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. పోలీస్ దర్యాప్తు నేపథ్యంగా ఎక్సలెంట్ థ్రిల్లర్, డ్రామాగా వస్తున్న ఈ చిత్రం పవర్పుల్‌ ఎమోషన్స్ సీన్స్‌తో ఆకట్టుకుంటోంది. దేశంలో ఖైదీల విచారణ గురించి ఈ చిత్రంలో స్పష్టంగా చూపించారు. మతపరంగా మైనారిటీలను మన సమాజం, న్యాయవ్యవస్థ ఎలా చూస్తుందనే విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశారట. విక్రమ్ ప్రభు కానిస్టేబుల్‌ పాత్ర ఒదిగిపోయి నటించాడు. అనిష్మా, అక్షయ్ కుమార్ యాక్టింగ్ బాగుంది. జస్టిన్ ప్రభాకర్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×