E-Paper
Advertisement

Allu Arjun -Atlee: అల్లు అర్జున్ సినిమాలో మరో టాలీవుడ్ స్టార్…ఏమన్నా ప్లాన్ చేసావా అట్లీ?

Allu Arjun -Atlee: అల్లు అర్జున్ సినిమాలో మరో టాలీవుడ్ స్టార్…ఏమన్నా ప్లాన్ చేసావా అట్లీ?
Advertisement

Allu Arjun -Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి కానీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ తెలియచేయకపోవడంతో అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో అల్లు అర్జున్(Allu Arjun) ఎంతో బిజీగా ఉన్నారు.

రూమర్లను ఖండించిన మృణాళ్..

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈమెకు సంబంధించి చిత్ర బృందం అధికారక ప్రకటన కూడా తెలియజేశారు. అయితే ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ కూడా భాగం కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలను ఆమె పూర్తిగా ఖండించారు. అదేవిధంగా మరొక బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించబోతున్నారని త్వరలో ఈమెకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతోందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు పాన్ ఇండియా స్టార్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)కూడా నటించబోతున్నట్టు సమాచారం.

అల్లు అర్జున్ సినిమాలో రానా..

Advertisement

ఇటీవల నటుడు రానా హీరో అల్లు అర్జున్ దర్శకుడు అట్లితో కలిసి బేటి అయ్యారని వీరి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయని తెలుస్తుంది . ఇలా వీరి మధ్య చర్చలు జరగడంతో అల్లు అర్జున్ సినిమాలో రానా భాగం కాబోతున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. దాదాపు రానా ఈ సినిమాలో కన్ఫర్మ్ అయ్యారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. ఇక ఇదే కనుక నిజమైతే ఈ సినిమా మరో లెవెల్ లో ఉండబోతుందని చెప్పాలి. ఇప్పటికే రానా బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే పలు వెబ్ సిరీస్ ల ద్వారా కూడా ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

సందీప్ రెడ్డి డైరెక్షన్ లో అల్లు అర్జున్..

Advertisement

ఇలా బాలీవుడ్ రేంజ్ లో మంచి క్రేజ్ ఉన్న రానా అల్లు అర్జున్ సినిమాలో నటించబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల మంచి అంచనాలు పెరిగిపోయాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ నటించిన బోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈయన తన 23వ సినిమాని మరొక తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్  డైరెక్షన్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సందీప్ రెడ్డి డైరెక్షన్ లో కూడా అల్లు అర్జున్ సినిమా ఉండబోతోంది అంటూ టి సిరీస్ బ్యానర్ అధినేత భూషణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Also Read: Actor Rajpal yadav: చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్ పాల్ కు ఉపశమనం..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×