E-Paper
Advertisement

Ashish vidyarthi Injured: ప్రమాదానికి గురైన నటుడు ఆశిష్ విద్యార్థి.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Ashish vidyarthi Injured: ప్రమాదానికి గురైన నటుడు ఆశిష్ విద్యార్థి.. ఇప్పుడు ఎలా ఉందంటే?
Advertisement

Ashish vidyarthi Injured: టాలీవుడ్ సినిమాలలో విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకులను మెప్పించిన వారిలో సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి(Ashish vidyarthi) ఒకరు. టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలలో విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆశిష్ విద్యార్థి ఇటీవల సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన ఇటీవల బుల్లితెరపై ప్రసారమైన కుక్ విత్ జాతి రత్నాలు అనే కార్యక్రమానికి జడ్జిగా కూడా వ్యవహరించారు ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఈయన కెరియర్ పరంగా బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

ప్రమాదానికి గురైన ఆశిష్ విద్యార్థి దంపతులు..

ఇదిలా ఉండగా తాజాగా నటుడు ఆశిష్ విద్యార్థి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా ఈయన ప్రమాదానికి గురైనట్లు తెలియజేశారు. తనకు జరిగిన ప్రమాదం గురించి తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా ఈయన మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి తన భార్యతో కలిసి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా ఒక బైక్ వీరిద్దరిని ఢీ కొట్టినట్లు తెలియజేశారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తమని హాస్పిటల్ లో చేర్చారని ఆశిష్ విద్యార్థి తెలియచేశారు. ఈ ప్రమాదం కారణంగా పెద్దగా గాయాలు ఏవి తగలలేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని తాము క్షేమంగా ఉన్నామని తెలిపారు.

హాస్పిటల్లోనే రూపాలి..

Advertisement

ఇకపోతే ఈయన సతీమణి రూపాలి(Rupali) మాత్రం ప్రస్తుతం హాస్పిటల్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలియజేశారు. ఇలా తనకు జరిగిన ప్రమాదం గురించి ఆశిష్ విద్యార్థి వెల్లడించడంతో అభిమానులు కాస్త కంగారు వ్యక్తం చేసినా, క్షేమంగా ఉన్నామని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక త్వరలోనే తన భార్య రూపాలి కూడా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

?igsh=M2VibGtoejFrdmFu

Advertisement

ఇక ఆశిష్ విద్యార్థి విషయానికి వస్తే ఈయన రూపాలి అనే మహిళను ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2023వ సంవత్సరంలో ఆశిష్ విద్యార్థి గువాహటి ఫ్యాషన్ వ్యవస్థాపకురాలు అయిన రూపాలిని మే 25వ తేదీ కోల్ కత్తాలో వివాహం చేసుకున్నారు. ఇలా అయిదు పదుల వయసులో ఈయన రెండవ వివాహం చేసుకోవడంతో అప్పట్లో వీరి వివాహం గురించి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇక వీరి వివాహం గురించి వచ్చిన విమర్శలపై కూడా గతంలో ఈయన స్పందించారు. ఈ వయసులో తనకు ఒక తోడు అవసరమనే పెళ్లి చేసుకున్నాను అంటూ వివరణ ఇచ్చారు. ఇక ఈయన మొదటి భార్య పేరు రాజోషి బారువా. ఈమె వృత్తిపరంగా నటి అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయిన అనంతరమే ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నారు.

Also Read: Peddi Movie: మెగా ఫాన్స్ కు షాకింగ్ న్యూస్.. వాయిదా పడిన పెద్ది?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×