E-Paper
Advertisement

అనసూయపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు.. ఛీ అవేం మాటలు?

అనసూయపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు.. ఛీ అవేం మాటలు?
Advertisement

Anasuya Bharadwaj:గతంలో ఎవరో ఎక్కడో ఎవరి గురించో అంటే పెద్దగా తెలిసేది కాదు.కాని ఇది సోషల్ మీడియా జమానా.ఎవరైనా ఇలా కామెంట్ నోరు దాటి బయట పడేలోపే ప్రపంచమంతా చుట్టేసి వస్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీకి ఉన్న పవర్ అలాంటిది.ఇక తాజాగా యాంకర్ అనసూయాయ పై పటాన్ చెరువు మాజీ mla bjp లీడర్, టి.నందీశ్వర్ గౌడ్ కొడుకు ఆశీష్ గౌడ్ చేసిన కామెంట్స్ ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి.

పటాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత టి. నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌తో జరిగిన ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది.ఆ ప్రోమోలో యాంకర్ అడుగుతూ భారత దేశాన్ని భారత మాతకి ముందే ఎన్నో సంవత్సరాల కిందట మొగల్స్ అనే ముస్లిమ్స్ ఉన్నారని అంటుంది అనడంతో రియాక్ట్ అయ్యాడు ఆశీష్ గౌడ్.

Advertisement

పాకిస్తాన్‌ది బాగా నచ్చినట్టుంది

”పాకిస్తాన్‌ది బాగా నచ్చినట్టుంది,అందుకే అక్కడ పోయి ఉంటే మంచిది అంటాను” అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశాడు. ఇక ‘కెమెరా ఉంది కాబట్టి నా లాంగ్ వేజ్ లో ఇలా చెప్పానని, కెమెరా గనుక లేకపోయి ఉంటె వేరేలా చెప్పేవాన్ని’ అంటూ ఫైర్ అయ్యాడు.ఇపుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Advertisement

అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు బయటకు వచ్చింది కేవలం ప్రోమో మాత్రమే. పూర్తి ఎపిసోడ్ ఇంకా రిలీజ్ కాలేదు. అసలు అనసూయ టాపిక్ ఎలా వచ్చింది,ఏ సందర్భంలో ఈ ప్రశ్న అడిగి ఉంటారు అనేది ఎపిసోడ్ వచ్చిన తర్వాతే పూర్తిగా తెలిసే అవకాశం ఉంది.

అయితే కొంతమంది ఒక అమ్మాయిని  అలా ఎలా వల్గర్ గా అంటారు అని కొంతమంది అంటే మరికొంతమంది కొన్ని సెకన్లు ఉన్న క్లిప్ చూసి ఒక అంచనాకి రాలేమంటూ తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

అనసూయ విషయానికి వస్తే

ఇక అనసూయ విషయానికి వస్తే తనకి ఏమనిపిస్తే అది చెప్పడం ఆమెకి బాగా అలవాటు.అలా చేసిన కామెంట్స్ చాలా సార్లు వైరల్ అయ్యాయి కూడా.ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వంపై ,అవలంభిస్తున్న విధానాలపై అనేక సార్లు క్వశ్చన్ చేసింది కూడా.ఇక తాజాగా ట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టి వారికి సపోర్ట్ చేసిన విషయం కూడా  బాగా వైరల్ అయింది.

అసలు అనసూయకు వివాదాలు కొత్త కాదు. గతంలో నటుడు శివాజీతో జరిగిన ‘చీర’ వివాదం ఎంత పెద్ద హాట్ టాపిక్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ వ్యవహారంపై ఇద్దరూ ఒకరిపై ఒకరు చేసిన కామెంట్స్ చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఆ తర్వాత కూడా ఎన్ని ట్రోలింగ్స్ చేసినా, ఎంతమంది నెట్టింట కామెంట్స్ తో ఎటాక్ చేసినా తను ఎప్పడూ వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.

రంగమ్మత్త ఎలా రియాక్ట్ అవుతుందో

ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే బుల్లి తెరపై తనదైన యాంకరింగ్ తో సత్తా చాటిన ఈ వెటరన్ బ్యూటీ  సినిమాల్లోనూ మంచి పేరు తెచ్చుకుంది.ముఖ్యంగా రంగస్థలం (2018)లో రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్ కి మాంచి బూస్టప్ ఇచ్చింది.ఇక ఆ తర్వాత యాత్ర (2019), పుష్ప: ది రైజ్(2021), విమానం(2023) లాంటి సినిమాల్లో నటించి మంచి మార్కులే  కొట్టేసింది.చూడాలి మరి మంటలు పెడుతున్న ఈ కామెంట్స్ పై రంగమ్మత్త ఎలా రియాక్ట్ అవుతుందో !

also read :బోయపాటి నన్ను చూసి మోసపోయాడు….తీన్మార్ చంద్రవ్వ షాకింగ్ కామెంట్స్ !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×