E-Paper
Advertisement

Danny Movie: ‘డానీ’ ఫస్ట్ లుక్ చూశారా?.. ఏంటి భయ్యా మరీ ఇంత వైల్డ్‌గా ఉంది

Danny Movie: ‘డానీ’ ఫస్ట్ లుక్ చూశారా?.. ఏంటి భయ్యా మరీ ఇంత వైల్డ్‌గా ఉంది
Advertisement

Danny Movie: కొల్లి గోపాల కృష్ణ సమర్పణలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జి గోగణ పిక్చర్స్ బ్యానర్ల మీద కళ్యాణ్‌జి గోగణ తెరకెక్కించిన చిత్రం ‘డానీ’. ఉపశీర్షిక వెల్కమ్ టు లవ్ జంగిల్. ఈ సినిమాలో ఆశీష్ గాంధీ హీరోగా నటించాడు. ఈ చిత్రాన్ని రిజ్వాన్, కుషి సంయుక్తంగా నిర్మించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను ఇచ్చారు. అందరూ ఆశ్చర్యపోయేలా టైటిల్‌తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు. రా అండ్ రస్టిక్ సినిమాల్ని ఎక్కువగా ఆదరిస్తున్న ఈ తరుణంలో ‘డానీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Read also-Sivakarthikeyan SK26: టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారిన శివ కార్తికేయన్ ‘ఎస్‌కే26’.. ఎందుకంటే?

‘ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే?

Advertisement

హీరో రగ్డ్ లుక్, జుట్టు, గడ్డం, బాడీ, మెడలో మాల ఇవన్నీ చూస్తుంటే మాస్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే పాత్రలా కనిపిస్తోంది. ఇక ఆ సిగరెట్ తాగే విధానం, హీరోయిన్ కాళ్లతో సిగరెట్ పట్టుకోవడం డిఫరెంట్‌గా ఉంది. ఇక పోస్టర్‌లోనే ఇంత వైవిధ్యం కనిపిస్తుంటే సినిమా ఇంకెంత విభిన్నంగా ఉంటుందో అని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ఫినిష్ చేసి జూన్ 26న సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రాకేందు మౌళి పాటల్ని రాయడమే కాకుండా సంగీతాన్ని అందించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర అప్డేట్‌లను ప్రకటించనున్నారు.

Read also-Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు నిజం చెప్పిన అవని..క్రిటికల్ గా అభి పరిస్థితి.. నిజాలు బయటకొస్తాయా..?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×