E-Paper
Advertisement

Aradhana: ఒకే టైటిల్.. ముగ్గురు లెజెండ్స్.. బాక్సాఫీస్ మిస్టరీ

Aradhana: ఒకే టైటిల్.. ముగ్గురు లెజెండ్స్.. బాక్సాఫీస్ మిస్టరీ
Advertisement

Aradhana: తెలుగు సినిమా చరిత్రలో కొన్ని టైటిల్స్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కానీ, ఒకే పేరుతో ముగ్గురు అగ్ర హీరోలు సినిమాలు చేయడం.. అందులో ఇద్దరు రికార్డులు తిరగరాస్తే, ఒకరు మాత్రం చేదు అనుభవాన్ని చవిచూడటం అనేది అరుదైన విషయం. ఆ టైటిల్ మరేదో కాదు.. ‘ఆరాధన’. అక్కినేని, ఎన్టీఆర్, చిరంజీవి.. ఈ ముగ్గురూ తమ ఇమేజ్‌ను పక్కన పెట్టి మరీ చేసిన ఈ ప్రయోగాల్లో అసలు ఏం జరిగింది?

అక్కినేని ‘ఆరాధన’ (1962)..రొమాంటిక్ హీరో సాహసం
అప్పటికే రొమాంటిక్ హీరోగా వెలిగిపోతున్న ఏఎన్నార్, తన ఇమేజ్‌ను పక్కన పెట్టి ఈ సినిమాలో ఒక ‘అంధుడి’ పాత్రలో నటించారు. ఒక స్టార్ హీరో కళ్లకు గంతలు కట్టుకుని సినిమా అంతా కనిపిస్తే జనం చూస్తారా? అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ ఈ సినిమా సంచలనం సృష్టించింది.బెంగాలీ నవల ‘సాగరిక’ ఆధారంగా వచ్చిన వి.మధుసూదనరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అక్కినేని కెరీర్‌లో ఒక క్లాసిక్ మైలురాయిగా నిలిచింది. సావిత్రి నటన, ఏఎన్నార్ పెర్ఫార్మెన్స్ ..కట్ చేస్తే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది.

Advertisement

ఎన్టీఆర్ ‘ఆరాధన’ (1976)..డైలాగులు లేని ‘సింహ గర్జన’

ఏఎన్నార్ బాటలోనే ఎన్టీఆర్ కూడా 1976లో ‘ఆరాధన’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.హిందీ చిత్రం ‘గీత్’ (1970) ఆధారంగా దర్శకుడు బి.వి.ప్రసాద్ ఈ సినిమాను రీమేక్ చేశారు.ఈ సినిమాలో సెకండాఫ్ మొత్తం హీరో పాత్ర మూగది. డైలాగ్ డెలివరీలో కింగ్ అయిన ఎన్టీఆర్.. మాటలు లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తో నటించడానికి మొదట భయపడ్డారు. అయితే భయపడ్డ ఎన్టీఆర్‌ను, నిర్మాత పుండరీకాక్షయ్య కన్విన్స్ చేసి ఈ సినిమా పట్టాలెక్కించారు.ఇక వాణిశ్రీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ముఖ్యంగా మహ్మద్ రఫీ పాడిన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. డైలాగులు లేకపోయినా నటనతో ఎన్టీఆర్ ప్రేక్షకులను కట్టిపడేశారు.

Advertisement

చిరంజీవి ‘ఆరాధన’ (1987)..మెగాస్టార్‌ను దెబ్బకొట్టిన ‘తమిళ’ వాసన
ఇక అప్పటికే ‘దొంగమొగుడు’, ‘రాక్షసుడు’ సినిమాలతో మాస్ కింగ్‌గా ఉన్న చిరంజీవి తన ఇమేజ్ మార్చుకోవాలని ఈ ‘ఆరాధన’ ప్రయోగం చేశారు. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉండేవి.తమిళ హిట్ ‘కడలోర కవితైగళ్’కు ఇది రీమేక్. కానీ, ఈ సినిమాలో నేటివిటీ లోపించడం, కథలో తమిళ పోకడలు ఎక్కువగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు దీనికి కనెక్ట్ కాలేకపోయారు.
అలా ఏఎన్నార్, ఎన్టీఆర్‌లకు కలిసొచ్చిన ఈ టైటిల్ చిరంజీవికి మాత్రం ఫ్లాప్‌ను మిగిల్చింది. అయితే ఇళయరాజా మ్యూజిక్ మాత్రం ఈ సినిమాను మ్యూజికల్ హిట్‌గా నిలబెట్టడం విశేషం.

మొత్తానికి ఒకే టైటిల్.. ముగ్గురు మహా నటులు.ఒకరు అంధుడిగా, మరొకరు మూగవాడిగా సక్సెస్ అందుకుంటే.. మాస్ హీరోగా ఉన్న చిరంజీవి మాత్రం అదే టైటిల్‌తో పరాజయాన్ని చవిచూశారు.సో ..సినిమా ప్రపంచంలో టైటిల్ కంటే ‘నేటివిటీ’ ఎంత ముఖ్యమో చెప్పడానికి ఈ ‘ఆరాధన’ సిరీసే ఒక పెద్ద ఉదాహరణ.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×