E-Paper
Advertisement

Mega 158:  మెగా158 కోసం రాంచరణ్ మ్యూజిక్ డైరెక్టర్.. హీరోయిన్ గా స్టార్ బ్యూటీ?

Mega 158:  మెగా158 కోసం రాంచరణ్ మ్యూజిక్ డైరెక్టర్.. హీరోయిన్ గా స్టార్ బ్యూటీ?
Advertisement

Mega 158: మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈయన నటించిన విశ్వంభర సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు (MSVPG Movie)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే .ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

ఏఆర్ రెహమాన్ సంగీతం..

ఈ సినిమా మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మెగా అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే చిరంజీవి మరో సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవి తన 158 వ సినిమాను దర్శకుడు బాబితో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.

ఆస్కార్ అవార్డు గ్రహీత..

Advertisement

ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడుగా వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది. జనవరి 6వ తేదీ ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు కావడంతో ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే చిరంజీవి బాబి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు కూడా ఏఆర్ రెహమాన్ సంగీతమదించునున్నట్లు సమాచారం.

చిరంజీవి సినిమాలో ఐశ్వర్యరాయ్?

Advertisement

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ సందడి చేయబోతున్నారని సమాచారం. అయితే ఈమె హీరోయిన్గా నటిస్తున్నారా లేదంటే ఏదైనా అతిథి పాత్రలో కనిపించబోతున్నారా అనేది తెలియదు కానీ చిరంజీవి సినిమాలో ఐశ్వర్య రాయ్ నటించబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి మెగా 158 సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో నిజానిజాలు తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా వెల్లడించాల్సి ఉంది. ఇదివరకే బాబి చిరంజీవి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి .

Also Read: The Paradise Film: నాని ఫాన్స్ కు గుడ్ న్యూస్… ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్  లోడింగ్..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×