E-Paper
Advertisement

నూతన ఏపీ ఎఫ్డీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం.. ముఖ్యఅతిథిగా బాలకృష్ణ, మంత్రి దుర్గేష్‌..

నూతన ఏపీ ఎఫ్డీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం.. ముఖ్యఅతిథిగా బాలకృష్ణ, మంత్రి దుర్గేష్‌..
Advertisement

AP FDC: ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు పడ్డాయి. విజయవాడ వేదికగా నూతనంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (AP FDC) సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విశిష్ట అతిథిగా విచ్చేశారు. నూతన ఎఫ్డీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన భరత్ భూషణ్‌తో పాటు కార్యవర్గ సభ్యులందరూ ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Read also-థాయిలాండ్ షాకింగ్ డెసిషన్.. భారతీయ పర్యాటకులకు ఉచిత వీసా రద్దు!

ఎన్టీఆర్ ఆశయ సాధనే లక్ష్యం..

Advertisement

పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ… తనకు ఈ గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. 1984లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కమిటీ వేసి సినీ పరిశ్రమ అభివృద్ధికి పునాది వేశారని, ఇప్పుడు అదే బాటలో బాలకృష్ణ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి రాత్రింబవళ్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అమరావతి సినీ హబ్‌గా మారాలి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు ఏపీలో చిత్ర పరిశ్రమ భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేశారు. నటుడు సుమన్ తల్వార్ మాట్లాడుతూ, హైదరాబాద్ తరహాలోనే అమరావతి కూడా ఒక భారీ సినీ హబ్‌గా మారాలని ఆకాంక్షించారు. చిత్ర పరిశ్రమకు మూలస్తంభాలైన డిస్ట్రిబ్యూటర్లను కాపాడుకోవాలని, ఏపీలో ఉన్న అద్భుతమైన లొకేషన్లలో షూటింగులు జరగడం ద్వారా రాష్ట్రానికి మంచి ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. నటి ఝాన్సీ, దర్శకుడు మెహర్ రమేష్, రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు మాట్లాడుతూ.. తమకు దక్కింది పదవులు కాదని, బాధ్యత అని, కళారంగాల అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని చెప్పారు. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అమరావతిలో ఒక స్టూడియోతో పాటు, ప్రభుత్వ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లను నిర్మిస్తామని, కృష్ణా నది తీరంలో ఈ ఏడాదే 5 సినిమాలు నిర్మిస్తామని కీలక ప్రకటన చేశారు.

నంది అవార్డులను పునఃప్రారంభిస్తాం: మంత్రి

Advertisement

గత ప్రభుత్వ హయాంలో కళలకు, సినీ పరిశ్రమకు ఎటువంటి ప్రోత్సాహం లభించలేదని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కళల పట్ల ప్రత్యేక అభిరుచి ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల నేతృత్వంలో ఎఫ్డీసీని బలోపేతం చేశామన్నారు. త్వరలోనే నిలిచిపోయిన ‘నంది అవార్డుల’ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తామని ప్రకటించారు. ఏపీలో షూటింగులు జరుపుకునే చిత్రాలకు ప్రభుత్వం పూర్తి మౌలిక సదుపాయాలు, రాయితీలు కల్పిస్తుందని స్పష్టం చేశారు.

Read also-Gundeninda Gudigantalu Meena : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. మీనా అవుట్..

ముఖ్యఅతిథి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, సినిమా వసూళ్లకు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ఒక కీలకమైన కేంద్రమని గుర్తుచేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టిన కృష్ణా జిల్లా గడ్డపై నుంచే ఈ నూతన ప్రస్థానం ప్రారంభం కావడం శుభపరిణామన్నారు. ప్రస్తుతం థియేటర్లు మూతపడుతున్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇకపై అలా జరగకుండా పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నూతన సభ్యులు తమ అనుభవంతో ఏపీని సినీ రంగంలో వేగంగా ముందుకు తీసుకెళ్లాలని, ప్రజలను మెప్పించే మరిన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ నూతన కార్యవర్గానికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘మా’ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్, 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ఎఫ్డీసీ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×