E-Paper
Advertisement

Nara Chandra Babu Naidu: అల్లు ఇంటికి ఏపీ సీఎం.. కొత్త జంటకు చంద్రబాబు అభినందనలు..

Nara Chandra Babu Naidu: అల్లు ఇంటికి ఏపీ సీఎం.. కొత్త జంటకు చంద్రబాబు అభినందనలు..
Advertisement

Nara Chandra Babu Naidu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandra Babu Naidu) తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ఇంటికి వెళ్లారు. చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ ధోతి వేడుక నిమిత్తం చంద్రబాబు దంపతులు హైదరాబాద్ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా వెళ్లారు. ఇటీవల నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్(Allu Sirish), నైనిక (Nainika)వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహ వేడుక నిమిత్తం అల్లు అరవింద్ స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా ఆహ్వానించారు.

కొత్త జంటకు సీఎం అభినందనలు..

ఈ పెళ్లి జరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్న తరుణంలో పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న చంద్రబాబు నాయుడు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కొత్త దంపతులను కలిసి వారికి అభినందనలు తెలియజేయడమే కాకుండా ఆశీర్వదించారు. కొత్త జంటకు పూల బొకేతో పాటు అమ్మవారి విగ్రహాన్ని అందజేస్తూ అభినందనలు తెలియజేశారు. ఇక అల్లు అరవింద్ సైతం చంద్రబాబు నాయుడుకి సాలువ కప్పి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు.

అల్లు ఫ్యామిలీని కలిసిన చంద్రబాబు..

Advertisement

ఇలా కొంత సమయం పాటు అల్లు అరవింద్ ఇంట్లో చంద్రబాబు నాయుడు పలు విషయాల గురించి మాట్లాడారని తెలుస్తోంది. ఇక చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు రాజకీయ నాయకులు ఉన్నారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇక అల్లు అర్జున్ (Allu Arjun)దంపతులు ప్రస్తుతం హైదరాబాదులో లేకపోవడంతో చంద్రబాబు నాయుడుని కలవలేకపోయారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు శిరీష్ నైనిక వివాహ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా హాజరైన సంగతి తెలిసిందే.

పెళ్లికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి..

Advertisement

అల్లు శిరీష్ నైనిక పెళ్లి వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి కూడా హాజరై సందడి చేశారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు. పెళ్లి సమయానికి చంద్రబాబు నాయుడు హాజరు కాలేని నేపథ్యంలోనే వ్యక్తిగతంగా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు. నైనిక అల్లు శిరీష్ వివాహం మార్చి 6వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక అల్లు శిరీష్ ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ నైనిక మాత్రం ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధంలేని అమ్మాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె అనే సంగతి తెలిసింది. వీరిద్దరూ గత మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉంటూ ప్రేమ వివాహం.

Also Read: Singer Chinmayi: వైరముత్తుకు జ్ఞానపీఠ అవార్డు.. కమల్ హాసన్ పై చిన్మయి ఫైర్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×