// // Ghaati Trailer - అడ్డొచ్చిన వారిని నెత్తురుతో కడిగేస్తాం.. మాస్‌ అవతార్‌లో అదరొట్టిన అనుష్క, చివరిలో సర్‌ప్రైజ్‌ -->
E-Paper
Advertisement

Ghaati Trailer: అడ్డొచ్చిన వారిని నెత్తురుతో కడిగేస్తాం.. మాస్‌ అవతార్‌లో అదరొట్టిన అనుష్క, చివరిలో సర్‌ప్రైజ్‌

Ghaati Trailer: అడ్డొచ్చిన వారిని నెత్తురుతో కడిగేస్తాం.. మాస్‌ అవతార్‌లో అదరొట్టిన అనుష్క, చివరిలో సర్‌ప్రైజ్‌
Advertisement

Ghaati Trailer: స్వీటీ అనుష్క ఫ్యాన్స్‌ అంత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్‌ వచ్చేసింది. ఇవాళ(ఆగష్టు) ఘాటీ మూవీ ట్రైలర్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చెయబోతున్నట్టు మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే తాజాగా ట్రైలర్‌ విడుదల చేసింది మూవీ టీం. ట్రైలర్‌ చివరిలో రిలీజ్‌ డేట్‌ని ప్రకటించి సర్‌ప్రైజ్‌ చేశారు. కాగా అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. లేడీ ఒరియంటెడ్‌గా యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్లో ఈ సినిమా రూపొందింది. ఇందులో అనుష్క ఎన్నడు చూడని సరికొత్త లుక్‌లో కనిపించింది. విలేజ్‌ మహిళగా మాస్‌ అవతార్‌లో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. ఇక ట్రైలర్‌ మొత్తం యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగింది. ఇందులో అనుష్క వైల్డ్‌ లుక్‌లో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది.

Advertisement

ట్రైలర్ ఎలా ఉందంటే..

కొండలోని ఘాట్ల పరిసర ప్రాంతాల్లో జీవించే ఘాటీ చూట్టూ ఈ కథ సాగనుందని ట్రైలర్‌ చూస్తే అర్థమైపోతుంది. వారంత నదులు దాటిస్తూ గంజాయ్‌ అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అధికారులు ఈ ఘాటీలను టార్గెట్‌ చేసి వారి వ్యాపారాన్ని లాక్కునే ప్రయత్నంలో వారి ఘాటీలు ఎదుర్కొన్న తీరు, వారిక ఎదురైన పరిణామల చూట్టు ఈ కథ సాగుతుంది. ఇక ఇందులో అనుష్క యాక్షన్స్‌ సీన్స్‌లో అదరగొట్టింది. ఇందులో విక్రమ్‌ ప్రభు, అనుష్కలు భార్యభర్తలు కనిపించబోతున్నారు. వీరిద్దరి ప్రేమాయణం, పెళ్లి సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇక చివరిలో ఓ వ్యక్తి మెడను కోసే సీన్‌లో స్వీటీ ఉగ్రరూపంలో కనిపించి షాకిచ్చింది.

Advertisement

రిలీజ్ డేట్ ఇదే

మొత్తానికి ఘాటీ ట్రైలర్‌ మూవీపై మరింత హైప్ క్రియేట్‌ చేస్తోంది. ఇక ముందు నుంచి ప్రచారంలో ఉన్న రిలీజ్‌ డేట్‌ని మేకర్స్‌ కన్‌ఫాం చేశారు. సెప్టెంబర్‌ 5న ఘాటీ రిలీజ్ డేట్‌ ఉండనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పుకార్లనే నిజం చేస్తూ అదే విడుదల తేదీని కన్‌ఫాం చేశారు. అయితే ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా తరచూ వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడో ఏప్రిల్‌ 18న విడుదల చేస్తున్నట్టు మూవీ టీం సరికొత్తగా ప్రకటించింది. కానీ, నిర్మాణాంతర కార్యక్రమాలు, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ వల్ల వాయిదా పడింది. దీంతో ఈ సినిమా జూలై 11న వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ ఇది పుకారుకే పరిమితం అయ్యింది. కానీ, ఇప్పటి వరకు మూవీ టీం నుంచి దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. ఘాటీ రిలీజ్‌ విషయంలో ఎన్నో వార్తలు,పుకార్లు వినిపించాయి. ఇక వాటన్నింటికి నేటితో చెక్‌ పెడుతూ ట్రైలర్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది మూవీ టీం.

Also Read: War 2 Tickets: వార్ 2 టికెట్స్‌.. హిందీ–తెలుగు వెర్షన్ల మధ్య ఇంత తేడానా? తెలుగు వారిన దోచేస్తున్న నిర్మాతలు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×