// // Anushka-Allu Arjun - అల్లు అర్జున్ - అనుష్క కాంబోలో మూవీ... రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..! -->
E-Paper
Advertisement

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!
Advertisement

Anushka Shetty and Allu Arjun Audio Call: ‘ది క్వీన్‌’ అనుష్క శెట్టి నటించి లేటెస్ట్‌ మూవీ ఘాటీ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో క్రైం, యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయిన. వేదం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. మొదటి సారి ఘాటీతో క్రిష్‌ యాక్షన్‌ జానర్‌ టచ్‌ చేశారు. దీంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్‌, టిజర్‌, ట్రైలర్లు మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ప్రమోషన్స్‌తో మరింత హైప్‌ పెంచుతోంది మూవీ టీం. స్వీటీ అనుష్క తెర వెనక ఉండే మూవీని గట్టిగా ప్రమోట్‌ చేస్తోంది.

వినూత్నంగా ఘాటీ ప్రమోషన్స్

Advertisement

ఆడియో కాల్స్‌ ద్వారా ఘాటీ విశేషాలను షేర్ చేస్తుంది. ఇప్పటికే రానాతో ఆడియో కాల్‌ మాట్లాడుతూ ఘాటీ విశేషాలను షేర్‌ చేసింది. మరోవైపు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ చేత ఘాటీ రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో ముచ్చటించింది స్వీటీ. దీనికి సంబంధించిన ఆడియోని తాజాగా మూవీ టీం ట్విటర్‌లో షేర్‌ చేసింది. అనుష్క, అల్లు అర్జున్ కాంబోలో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. అందులో క్రిష్‌ దర్శకత్వంలో ఒక చిత్రం ఉండటం విశేషం. అల్లు అర్జున్‌, అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన వేదం మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివిధ పాత్రలను చూట్టూ ఈ చిత్రం సాగుతుంది. అందులో ఇద్దరిది భిన్నమైన పాత్రలు.

ఆ తర్వాత వీరిద్దరు రుద్రమ దేవి చిత్రంలోనూ నటించారు. బన్నీ, స్వీటీ రేర్‌ కాంబో అనే విషయం తెలిసిందే. ఇక వీరిద్దర కలిసి తమ పాత సినిమాలతో పాటు క్రిష్‌ డైరెక్షన్‌ గురించి కాసేపు సరదాగా ముచ్చటించారు . అంతేకాదు వీరిద్దరి కాంబో ఓ సినిమా రావాలని, దానికి దర్శకులు ఎవరైతే బాగుంటుందని కూడా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం అనుష్క–అల్లు అర్జున్‌ ఆడియో కాల్‌ సోషల్‌ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది. ఈ సందర్భంగా ఘాటీలో అనుష్క పాత్రలోపై బన్నీ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత జనరేషన్‌ హీరోయిన్లలో యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీసే ఒకేఒక్క నటి నువ్వే అని పోగిడాడు. హీరోలకు ధీటుగా యాక్షన్‌ సీన్స్‌ అదరగొట్టే తొలి హీరోయిన్‌ నువ్వే.. అంటూ కొనియాడాడు. రుద్రమదేవి, అరుంధతి, బాహుబలి.. ఇప్పుడు ఘాటీ. హీరోలకు పోటీ యాక్షన్‌ చేసి చూపించాడు. ప్రస్తుతం జనరేషన్‌లో హీరోగా సాటిగా యాక్షన్‌ చేసే ఒకేఒక్క నటి నువ్వే అన్నాడు.

పుష్ప-షిలావతి కాంబోలో మూవీ

Advertisement

ఇక పుష్ప, ఘాటీ బాక్సాఫీసు క్లాష్‌ అవ్వాలని అన్నావట.. నేను విన్నాను అంటూ అనుష్కని కాసేపు ఆటపట్టించాడు. పుష్ప–షిలావతి కలిసి సినిమా చేస్తే.. దర్శకుడు సుకుమార్‌? క్రిష్‌? ఎవరు కావాలి అడగ్గా.. అమ్మో బాబోయ్‌ దీనికి నేను సమాధానం చెప్పలేను అంది అనుష్క. ఆ వెంటనే బన్నీ.. అయితే రెండు పార్ట్స్‌ తిసి.. ఇద్దరిని దర్శకత్వం చేయమని చెబుతామంటూ ఈ ప్రశ్నకు సోల్యూషన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌-అనుష్క ఆడియో కాల్‌ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఎన్నో వాయిదాల తర్వాత అనుష్క ఘాటీ మూవీ ఎట్టకేలకు సెప్టెంబర్‌ 5న థియేటర్లలో రిలీజ్‌ కాబోతోంది. విక్రమ్‌ ప్రభు, రమ్యకృష్ణ, జగపతి బాబు. చైతన్య రావు తదితరలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొండపాత్రంలో నివసించే ప్రజల జీవన శైలి, వారి జీవినాధారం ఎలా ఉంటుందో ఈ ఘాటీలో చూపించాడు. ఇక ఇందులో అనుష్క యాక్షన్‌ సీన్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. కానీ, ప్రమోషన్సే పెద్దగా బజ్‌ లేదంటున్నారు ఓ వర్గం ఆడియన్స్‌. మరి ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం ఎలాంటి టాక్‌ తెచ్చుకుంటుందో మరి తెలనుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×